Kamal Haasan Indian 2 First Single Upadte: లోకనాయకుడు కమల్‌ హాసన్‌, దిగ్గజ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'ఇండియన్‌ 2'. తెలుగులో భారతీయుడు 2 పేరుతో విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌గా 'ఇండియన్‌ 2' వస్తుండటంతో ఈ సినిమా కోసం ఇండియన్‌ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన వాయిదాలు, బ్రేక్స్‌తో మెల్లిమెల్లిగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఇప్పుడు జూలై రిలీజ్ రెడీ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఇండియన్‌ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి రేపు ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేయబోతుంది మూవీ టీం. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది ఇండియన్‌ 2 మూవీ టీం. 'సౌరా' అంటూ సాగే ఈ పాటకు రేపు (మే 22) సాయంత్రం 5 గంటలకు రిలీజ్‌ చేయబోతున్నారు. దీంతో మూవీ లవర్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్‌ కోసం ఇండియన్‌ మూవీ లవర్స్‌ తెగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






ఈ క్రమంలో సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ వస్తుండటంతో అంతా పండగ చేసుకుంటున్నారు. ఇక ఇండియన్ 2 మూవీ కోలీవుడ్‌ యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ 'సేనాపతి' కోసం అనిరుధ్‌ ఎలాంటి మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించి ఉంటాడా? అని మ్యూజిక్‌ లవర్స్‌ అంతా అంచనాలు వేసుకుంటున్నారు. టాలీవుడ్‌ చందమామా కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో సిద్ధార్థ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్  అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన  కమల్‌ లుక్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు ‘విక్రమ్’ మూవీతో అదిరిపోయే హిట్ అందుకుని మంచి జోష్ లో ఉన్న కమల్ హాసన్, అదే ఊపులో ‘ఇండియన్ 2’తోనూ సత్తా చాటాలి అనుకుంటున్నారు.  


Also Read: మా అమ్మనాన్న విడాకులు తీసుకోలేదు - సంచలన విషయాలు బయటపెట్టిన పవిత్ర జయరామ్‌ కూతురు, భర్త ఎమోషనల్‌


సుమారు రెండు దశాబ్దాల క్రితం శంకర్, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ‘భారతీయుడు‘ సినిమా సంచలన విజయం సాధించించింది. అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కొత్త రికార్డులు నెలకొల్పింది. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘ఇండియన్ 2‘ సినిమా తెరకెక్కించారు.   ఓవైపు కమల్ హాసన్ తో ఈ సినిమా తెరకెక్కిస్తూనే, మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్ లోనూ పాల్గొన్నారు. అలా స్లో స్లోగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న భారతీయుడు 2 జూలై 27 వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతుంది. దాదాపు 5 భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు.