30 Years For Hum Aapke Hain Koun: బాలీవుడ్‌లో కొన్ని ఎవర్‌గ్రీన్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్లుగా ఎదుగుతున్న హీరోల కెరీర్లు ఇలాంటి సినిమాల వల్లే మలుపులు తిరిగాయి. అలా బీ టౌన్ ఆల్ టైమ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఒకటి ఉంది. అదే ‘హమ్ ఆప్కే హై కౌన్’. సల్మాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ఈ సినిమా 1994లో విడుదలయ్యింది. ఇప్పటికీ సరిగ్గా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయినా చాలామందికి ఈ మూవీ ఫేవరెట్‌గా నిలిచిపోయింది. అంతే కాకుండా ఒక బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడి జీవితం ఈ సినిమా వల్ల మలుపు తిరిగిందంటే నమ్ముతారా? దానివెనుక పెద్ద కథే ఉంది.


అందరికీ ఫేమ్..


‘హమ్ ఆప్కే హై కౌన్’ను అంత సీరియస్‌గా తెరకెక్కించలేదని మేకర్స్ అంటుంటారు. కానీ అనుకోకుండా ప్రేక్షకుల ఆ సినిమాను ఒక రేంజ్‌లో ఆదరించారు, బ్లాక్‌బస్టర్ చేశారు. ఈ మూవీ బాలీవుడ్‌కు కిక్ ఇవ్వడంతో పాటు ఇందులో నటించిన సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, రేణుకా షహానే, మొహ్నీష్ బాహ్ల్ కెరీర్లను కూడా వేగవంతం చేసింది. దర్శకుడు సూరజ్ బర్జాత్యా కూడా ఒక్కసారిగా స్టార్ అయిపోయారు. వీరితో పాటు పలు సినిమా థియేటర్ల ఓనర్లు, అక్కడ బ్లాక్ టికెట్స్ అమ్ముకునేవాళ్లు కూడా ‘హమ్ ఆప్కే హై కౌన్’ వల్ల లాభం పొందారు. ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు మూవీ టీమ్ అంతా ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేసి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.


అక్కడ ఒప్పుకోలేదు..


1994లో ముంబాయ్‌లోని లిబర్టీ సినిమాలో ‘హమ్ ఆప్కే హై కౌన్’ విడుదలయ్యింది. ఈ మూవీ అక్కడ రిలీజ్ అయ్యే సమయానికి థియేటర్ పరిస్థితి బాలేక ఫ్యామిలీ ఆడియన్స్ రావడం మానేశారు. అందుకే లేడీస్‌కు బాత్రూమ్స్ సరిగా ఉండేవి కాదు. దీని వల్ల అక్కడ అన్నీ అడల్ట్ సినిమాలు మాత్రమే రన్ అయ్యేవి. కానీ ‘హమ్ ఆప్కే హై కౌన్’ వచ్చి లిబర్టీ సినిమా రూపురేఖలనే మార్చేసింది. ముందుగా మెట్రో సినిమా అనే థియేటర్.. ఈ మూవీని స్క్రీన్ చేయడానికి ఒప్పుకోకపోతే లిబర్టీ సినిమా ముందుకొచ్చి ‘హమ్ ఆప్కే హై కౌన్’ను స్క్రీన్ చేసిందని డైరెక్టర్ స్వయంగా బయటపెట్టారు. దీంతో వెంటనే లిబర్టీ సినిమాను మంచిగా మార్చే పనులు మొదలయ్యాయి.


థియేటర్‌దే కీలక పాత్ర..


లిబర్టీ సినిమాలో ‘హమ్ ఆప్కే హై కౌన్’కు దాదాపు ఏడాది ముందే టికెట్స్ బుక్ అయిపోయాయట. అందుకే బుకింగ్స్ అనేవి సంవత్సరం పాటు ఓపెన్ కాలేదని సినిమా నిర్మాత తెలిపారు. ఈ సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్మడం వల్ల ఒక వ్యక్తి రెండు ఫ్లాట్స్ కొనగలిగాడని చెప్పి నవ్వారు నిర్మాత కమల్ కుమార్ బర్జాత్య. అలా లిబర్టీ అనేది ‘హమ్ ఆప్కే హై కౌన్’ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. 2019 మే 12న లిబర్టీ ఓనర్ అయిన నజీర్ హుస్సేన్ మరణించారు. అప్పుడు ‘హమ్ ఆప్కే హై కౌన్’ టీమ్ అంతా వెళ్లి ఆయనకు స్వయంగా సంతాపం ప్రకటించారు.



Also Read: స్టేజ్‌పైన చెప్తే పద్ధతిగా ఉండదు, తను చార్మీకి రైట్ హ్యాండ్ - ‘డబుల్ ఇస్మార్ట్’ ఈవెంట్‌లో రామ్