Ram Pothineni At Double Ismart Trailer Launch: చాక్లెట్ బాయ్ అని పేరు తెచ్చుకున్న రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. అంతే కాకుండా ఈ మూవీ వల్ల తన మ్యానరిజం కూడా మారింది. అప్పటినుండి మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యాడు రామ్. ఇప్పుడు మరోసారి అదే ఇస్మార్ట్ శంకర్ పాత్రలో ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమాను సిద్దం చేశాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్‌కు రామ్‌తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు. తన ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌కు అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు రామ్. ‘డబుల్ ఇస్మార్ట్’ ఎక్స్‌పీరియన్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.
గుర్తుండిపోయే క్యారెక్టర్..
‘‘2018 డిసెంబర్‌లో పూరీ జగన్నాధ్ గోవా వెళ్లారు. పక్కన ఉంటే ఎనర్జీ ఉంటుందని నన్ను రమ్మంటే నేను కూడా వెళ్లాను. ఎలాంటి సినిమా చేద్దామని ఆయన నన్ను అడిగినప్పుడు చాలా ఏళ్లు అయిపోయింది పదేళ్ల వరకు గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామన్నాను. అప్పుడు రాశారు ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్‌ను స్టేజ్‌పైన వర్ణించడం పద్ధతిగా ఉండదు. కానీ డీసెంట్‌గా చెప్పాలంటే వాడొక మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్. ఇది నాకు లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. యాక్ట్ చేస్తున్నప్పుడే చాలా కిక్ వచ్చింది. ఆ కిక్‌లో 10 శాతం ఆడియన్స్‌కు వచ్చినా నేను చాలా హ్యాపీ అవుతాను. నేను ఎంజాయ్ చేసినంత మీరూ చేయాలి’’ అంటూ పూరీతో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చాడు రామ్.
కమర్షియల్ సినిమా ఈజీ కాదు..
‘‘ఇస్మార్ట్ శంకర్ లాంటి మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ క్యారెక్టర్‌తో పాటు అదిరిపోయే స్క్రిప్ట్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ రాశారు. ఇప్పటివరకు పూరీ చేసిన సినిమాల్లో చాలా టైమ్ తీసుకొని చేసిన సినిమా ఇది. చాలా కష్టపడ్డారు. కమర్షియల్ సినిమా అంటే గుర్తొచ్చేది పూరీ జగన్నాధ్. కమర్షియల్ సినిమా అంటే ఈజీ కాదు. నాకు సినిమాల్లో గ్యాప్ వచ్చినప్పుడు ఫారిన్ వెళ్తుంటాను. ముఖ్యంగా ఇటలీలో ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు. వాళ్ల దగ్గర ఓకే అంటాను కానీ హైదరాబాద్ వచ్చి డబుల్ మసారా బిర్యానీనే ఆర్డర్ చేస్తాను. ఆ కిక్ మనకే తెలుస్తుంది. అలా మన రక్తంలోనే కమర్షియల్ సినిమా ఉంది. కమర్షియల్ సినిమాకు ఉండే సక్సెస్ రేట్ చాలా తక్కువ’’ అంటూ కమర్షియల్ సినిమాలపై వ్యాఖ్యలు చేశాడు రామ్.
చార్మీ రైట్ హ్యాండ్..
‘‘అలీతో ఈ సినిమాలో కలిసి షూట్ చేయలేకపోయాను. కానీ లొకేషన్‌లో అందరూ చాలా ఎంజాయ్ చేశామని చెప్పారు. హీరోయిన్ కావ్య అయితే లొకేషన్‌లో చీమలకు చక్కెర పెట్టేంత మంచి అమ్మాయి. చీమలనే అలా చూసుకుంటుందంటే బాయ్‌ఫ్రెండ్‌ను ఇంకా బాగా చూసుకుంటుందని అనుకుంటున్నాను. విషు.. ఛార్మీకి రైట్ హ్యాండ్ లాంటోడు. ఇద్దరు కలిసి యుద్ధాలు చేశారు. సినిమా అంతా పూర్తయ్యి బాగా అలసిపోయిన సమయంలో ప్రమోషన్స్ పెడతారు. ప్రమోషన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అప్పుడే మీ దగ్గర నుండి ఎనర్జీ వస్తుంది’’ అంటూ ‘డబుల్ ఇస్మార్ట్’లో కలిసి పనిచేసిన అందరికీ థాంక్యూ చెప్పాడు రామ్.
Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ విడుదల - ఈసారి యాక్షన్, రొమాన్స్ అంతా డబుల్