Sound Party Movie Actress Hrithika Srinivas Interview : తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త కథానాయకులు వస్తున్నారు. సినిమా నేపథ్యం ఉన్న అమ్మాయిలు కొందరు ఉన్నారు. వారిలో హృతికా శ్రీనివాస్ ఒకరు. ఎవరి అమ్మాయి అనుకుంటున్నారా!? సీనియర్ కథానాయిక, నటి ఆమని మేనకోడలు. ఆల్రెడీ తెలుగులో 'అల్లంత దూరాన' అని ఓ సినిమా చేశారు. ఈ శుక్రవారం (నవంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'సౌండ్ పార్టీ' సినిమాలోనూ నటించారు. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ జోడీగా ఆమె సందడి చేయనున్నారు.
చిన్నప్పుడు షూటింగులకు వెళ్లింది తక్కువే!
ఆమని తనకు మేనత్త అయినప్పటికీ చిన్నతనంలో షూటింగులకు వెళ్లింది తక్కువే అని హృతికా శ్రీనివాస్ తెలిపారు. తనకు ఊహ తెలిసే సమయానికి మేనత్తకు పెళ్లి కావడంతో చిత్రీకరణలకు వెళ్లడం కుదరలేదన్నారు. ''ఆమని గారితో ఇప్పుడు షూటింగులకు వెళ్తున్నా. రియాలిటీ షోలు, సీరియళ్లు, సినిమా సెట్స్ కు వెళ్ళా. నాకు నటి కావాలని ఉందని చెప్పినప్పుడు... 'చదువుకుంటున్నావు కదా! అప్పుడే ఎందుకు? చాలా కష్టపడాలి' అని ఆమని అన్నారు. నేను కష్టపడతానని చెప్పి వచ్చా. ప్రస్తుతం చదువుకుంటూనే సినిమాలు చేస్తున్నా'' అని హృతికా శ్రీనివాస్ అన్నారు.
టీమిండియాకు ధోనీలా... 'సౌండ్ పార్టీ'కి సిరి!
'సౌండ్ పార్టీ'లో తాను సిరి పాత్రలో నటించానని హృతికా శ్రీనివాస్ వివరించారు. తన క్యారెక్టర్ గురించి ఆమె మాట్లాడుతూ ''సిరి చాలా తెలివైన అమ్మాయి. నేను అంత తెలివైన దాన్ని కాదు. మా దర్శకుడు సంజయ్ గారు కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. నా క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుంది. కానీ, ప్రేక్షకులకు మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. పతాక సన్నివేశాలలో నా కారెక్టర్ ద్వారా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. టీమిండియాకు ధోని ఎలా అయితే ఫినిషింగ్ టచ్ ఇస్తారో... సౌండ్ పార్టీకి సిరి అలర్ట్రిస్ట్ ఇస్తుందని దర్శకుడు సంజయ్ శరీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజమే'' అని హృతికా శ్రీనివాస్ అన్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ సౌండ్ పార్టీ ప్రేక్షకులందరికీ వినోదం పంచుతుందని సినిమా ఘనవిజయం సాధిస్తుందని ఆమె ఆశ భావం వ్యక్తం చేశారు.
Also Read : 'సుడిగాలి' సుధీర్ రిస్క్ చేస్తున్నాడా? లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా?
'సౌండ్ పార్టీ'లో వీజే సన్నీ, శివన్నారాయణ తండ్రి కుమారులుగా నటించారు. అమాయకులైన వాళ్ళిద్దరూ ఈజీ మనీ కోసం ఏం చేశారనేది సినిమా కాన్సెప్ట్ అని, బిట్ కాయిన్ విలువను కూడా సినిమాలో చెప్పారన్నారు రితికా శ్రీనివాస్. వీజే సన్నీ మంచి కోస్టార్ అని చిత్రీకరణ చేసేటప్పుడు తెలుగులో కొన్ని పదాలు పలకడం తనకు కష్టమైతే ఆయన సహాయం చేశారని ఆమె వివరించారు.
హీరోలలో నాని... హీరోయిన్లలో సాయి పల్లవి!
మేనత్త ఆమని కాకుండా తనకు నచ్చిన కథానాయక సాయి పల్లవి అని హృతికా శ్రీనివాస్ చెప్పారు. సాయి పల్లవి ఎంపిక చేసుకునే పాత్రలు కథలు తనకు ఎంతో ఇష్టమని అన్నారు. హీరోల విషయానికి వస్తే... నాచురల్ స్టార్ నాని తన ఫేవరెట్ అని చెప్పారు.
Also Read : మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?