Fighter Sensor: ‘విక్రమ్ వేద’ మూవీ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె, సీనియర్ నటుడు అనీల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. వయాకామ్‌ 18 స్టూడియోస్, మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్, పాటలకు మంచి ఆదరణ లభించింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలకు రెడీ అవుతోంది.


‘ఫైటర్’ సెన్సార్ కంప్లీట్


తాజాగా ‘ఫైటర్’ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తి అయ్యింది. అయితే, సెన్సార్ సందర్భంగా పలు సన్నివేశాలను కట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు సభ్యులు సూచించారట. ఈ చిత్రంలో హృతిక్, దీపికా మధ్య పలు బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయట. వీటిని కట్ చేయాల్సిందిగా మేకర్స్ కు సూచించారట. కొన్ని బూతు పదాలను కూడా మ్యూట్ చేయాలని సూచించారు. యువతని లైంగికంగా ప్రేరేపించే కొన్ని సన్నివేశలను కట్ చేశారు. ఈ 8 సెకన్ల బోల్డ్ సన్నివేశాలతో పాటు  టీవీ వార్తలు చ‌దివే దృశ్యంలో 25 సెకన్ల ఆడియో తొల‌గించారు. ఈ సీన్లు కట్ చేసిన తర్వాత ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. సెన్సార్ సర్టిఫికేట్‌ ప్రకారం ఈ సినిమా నిడివి 166 నిమిషాలు. అంటే రన్ టైమ్ రెండు గంటల 46 నిమిషాలు.


దీపికా, సిద్దార్థ్ మధ్య గొడవ?


మరోవైపు దీపికా పదుకొణె, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ మధ్య గొడవ జరిగినట్లు ఊహాగానాలు వినిపించాయి. అందుకే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె సరిగా పాల్గొనట్లేదనే టాక్ నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై ఆనంద్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాలో హృతిక్, దీపికా కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. హృతిక్ రోషన్,  దీపికా పదుకొణె తొలిసారిగా జోడీ కడుతున్నారు. 


అడ్వాన్స్ బుకింగ్స్ జోరు


ఇప్పటికే ‘ఫైటర్’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్, ఫ్యాన్స్​ ఎగబడుతున్నారు. ‘ఫైటర్’  తొలిరోజు 86,516 అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసి, రూ. 2.84 కోట్లు సాధించింది. ఇందులో 2డీ హిందీ వెర్షన్ 33,624 టిక్కెట్లు, 3డీ హిందీ వెర్షన్‌ 46,790 టిక్కెట్లు, ఐమాక్స్ 3డీ యాక్షన్ 4,881 టిక్కెట్లు, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్ 1,221 టిక్కెట్టు సేల్ అయ్యాయి. ఢిల్లీలో రూ. 67.39 లక్షలు , మహారాష్ట్రలో రూ. 75.02 లక్షలు, తెలంగాణలో రూ. 40.73 లక్షలు, కర్ణాటకలో రూ.43.54 లక్షలూ అడ్వాన్సు బుకింగ్స్ ద్వారా వసూళ్లు లభించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్రబృందం భావిస్తోంది. ఇండియా ఫస్ట్‌ ఏరియల్ యాక్షన్‌ ఫిల్మ్‌ గా రాబోతున్న ‘ఫైటర్’ మూవీలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌, సంజీదా షేఖ్‌, తలత్‌ అజిజ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.






Read Also: ఆ డ్రెస్ వేసుకుని సిగ్గుతో బయటకు రాలే, బోల్డ్ సీన్స్ చేసే వాళ్లకు దండం పెట్టాలన్న మీనా