Meena About Glamour Roles And Bikini Scenes: మీనా. ఒప్పుడు తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. 90వ దశకంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్ సహా పలువురు అగ్ర హీరోలతో నటించారు. అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, బోల్డ్ సీన్లు, గ్లామరస్ పాత్రల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బోల్డ్ సీన్లు చేయాలనే సలహా ఇచ్చింది ఆయనే!
సాధారణ పాత్రలు చేసే తనకు గ్లామర్ రోల్స్ చేయాలని ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా సలహా ఇచ్చినట్లు మీనా వెల్లడించారు. “నేను మొదటి నుంచి గ్లామరస్ పాత్రలు చేసేదాన్ని కాదు. సాధారణ పాత్రల్లోనే నటించేదాన్ని. ఆ సమయంలో చాలా మంది నాకు గ్లామర్ పాత్రలు చేయాలని సలహా ఇచ్చారు. బోల్డ్ సీన్లు, స్విమ్ సూట్ సన్నివేశాలు కూడా చేయాలని ప్రభుదేవా నాకు అడ్వైజ్ ఇచ్చారు. ఆయన సలహా ఇచ్చిన కొన్నాళ్లు ఓ గ్లామరస్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. ప్రభుదేవాతో చేసే సినిమాలోనే స్విమింగ్ డ్రెస్ వేసుకున్నాను. కానీ, సిగ్గుతో మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేదు.బోల్డ్ సీన్లలో నటించడం చాలా కష్టమైన పని. అలాంటి సన్నివేశాల్లో కొందరు హీరోయిన్లు చక్కగా నటిస్తారు. వారి కాళ్లకు నిజంగా దండం పెట్టాలి అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చారు.
ఇక 'దృశ్యం' సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది మీనా. పలు మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. 'బిగ్ బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తున్న 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు'లో రాజేంద్ర ప్రసాద్, మీనా జంటగా కనిపించారు. ప్రస్తుతం మీనా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి.
మీనా రెండో పెళ్లిపై మీడియా కథనాలు
అటు మీన భర్త విద్యాసాగర్ 2022లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. అయితే, ఇంట్లో పెద్దలు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నా, తను మాత్రం అంగీకరించట్లేదని తెలుస్తోంది. రీసెంట్ గా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తన లైఫ్ గురించి, జీవితంలో జరగబోయే అంశాలు గురించి కథలు, కథనాలు ప్రసారం చేయడం ఆపేయమని ఆమె రిక్వెస్ట్ చేశారు. అయినా సరే, మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నారని తమిళ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. తన కంటే వయసులో చిన్నోడితో, విడాకులు తీసుకున్న వ్యక్తితో మీనా రెండో పెళ్ళికి రెడీ అయ్యారని ఓ తమిళ యూట్యూబ్ మీడియా వెల్లడించింది. ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చిన యువ తమిళ కథానాయకుడు, మీనా పెళ్లి చేసుకోనున్నారని ఆ కథనం సారాంశం. ఈ వార్తల్లో వాస్తవం లేదనే టాక్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది.
Read Also: సెట్లో ఉన్నంత సేపు నాకు అదే ధ్యాస, అసలు విషయం చెప్పేసిన శ్రీలీల