Rupeysh About Shashtipoorthi Movie: ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఫ్యామిలీ ఎమోషన్స్, కుటుంబ విలువలు చాటి చెప్పేలా 'షష్టిపూర్తి' మూవీ ఉంటుందని హీరో రూపేష్ అన్నారు. ఆయన హీరోగానే కాకుండా నిర్మాతగా వ్యవహరించిన 'షష్టిపూర్తి' మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను రూపేష్ పంచుకున్నారు.
ఆడియన్స్ కనెక్ట్ అవుతారు
ప్రస్తుతం వయలెన్స్‌తో కూడిన చిత్రాలు వస్తున్నాయని.. 'షష్టి పూర్తి' విలువలతో కూడిన స్టోరీ అని రూపేష్ అన్నారు. ''షష్టిపూర్తి' కథ నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానే ఉన్నా హీరోగా నటించడాన్నే ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇది పూర్తిగా కల్పిత చిత్రమే. కానీ ఇందులోని పాత్రల్ని చూస్తే ఆడియెన్స్ మాత్రం తమని తాము చూసుకున్నట్టుగా కనెక్ట్ అవుతారు. కుటుంబ అంశాలతో పాటుగా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాం.' అని చెప్పారు.
అలా ఈ ప్రాజెక్టులోకి..
‘షష్టిపూర్తి’ కథను రాజేంద్ర ప్రసాద్ గారి కోసమే పవన్ ప్రభ రాసుకున్నారని.. ఆయన కొడుకుగా నటించే వారిది కొత్త మొహం అయితే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను చూస్తారని అభిప్రాయపడ్డారని రూపేష్ అన్నారు. 'కొత్త ఫేస్ కోసం దర్శకుడు చూడగా నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఇళయరాజా గారి మ్యూజిక్‌తో సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ పాటకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. బయట ప్రచారం జరిగినట్టుగా ఏమీ జరగలేదు. కీరవాణి గారు అడిగిన వెంటనే పాటను రాసి ఇచ్చారు.' అని తెలిపారు.
Also Read: 'వర్జిన్ బాయ్స్'లో పెదవుల తడి... రొమాంటిక్‌గా తీసిన ట్రెండీ మెలోడీ
స్క్రీన్‌పై బడ్జెట్
'షష్టిపూర్తి' కథ విన్న తర్వాత ఇలాంటి పెద్ద టీం ఉండాల్సిందే అని ఫిక్స్ అయి పెద్ద టెక్నీషియన్ల కోసం ట్రై చేశామని రూపేష్ చెప్పారు. 'బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువే అయింది. అయితే ఆ ఖర్చు పెట్టింది అంతా కూడా తెరపై కనిపిస్తుంది. అయితే ఎవ్వరూ కూడా ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. నేను ముందుగా ఈ ప్రాజెక్ట్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాను. మా ఆయి ప్రొడక్షన్స్ అంటే.. మా అమ్మ ప్రొడక్షన్ అని అర్థం. అమ్మ జ్ఞాపకార్థంగానే అలా పెట్టుకున్నాను. అవుట్ పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.' అని చెప్పారు.
మోత్ టాక్‌తోనే..
రాజేంద్ర ప్రసాద్ గారైనా, అర్చన గారైనా, ఇళయరాజా గారైనా సరే ఏదైనా ఒక పని చేస్తే వంద శాతం ఫోకస్డ్‌గా ఉంటారని.. అందుకే వాళ్లు ఆ స్థాయికి వెళ్లారని రూపేష్ ప్రశంసలు కురిపించారు. 'నాన్ థియేట్రికల్ ద్వారా మంచి బిజినెస్ జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మా చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడి స్పందనను చూసి ఓవర్సీస్‌లో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మౌత్ టాక్‌తోనే ఈ మూవీ ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను.' అని అన్నారు.
ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలు పోషించగా.. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. పవన్ ప్రభ దర్శకత్వం వహించగా.. 'MAA AAIE' ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ నిర్మించారు.