'వర్జిన్ బాయ్స్' టైటిల్, ఆ టీజర్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాయి. సినిమా చిన్నది అయినా సరే సౌండ్ ఎక్కువ చేస్తోంది. టైటిల్ బట్టి ఇదొక రొమాంటిక్ మూవీ అని గెస్ చేయవచ్చు. అందువల్ల యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. లేటెస్టుగా వచ్చిన సాంగ్ మెలోడీ లవర్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది.

పెదవుల తడి... ట్రెండీ రొమాన్స్!'వర్జిన్ బాయ్స్' నుంచి తాజాగా 'పెదవుల తడి...' పాట విడుదల అయ్యింది. కాలేజీ స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మాంటేజ్ సాంగ్ కింద పిక్చరైజ్ చేశారు. గీతానంద్, మిత్రా శర్మ మధ్య సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే శ్రీహాన్ - జెన్నిఫర్ మధ్య సన్నివేశాల్లో రొమాన్స్ దట్టించినట్టు అర్థం అవుతోంది.

'పెదవుల తడి...' పాటకు పూర్ణ చారి లిరిక్స్ రాయగా... ఆదిత్య ఆర్ కె పాడారు. ఈ పాటకు స్మరణ్ సాయి సంగీతం అందించారు. యువతీ యువకుల మధ్య ప్రేమ - చిలిపి సరదాలను ఆవిష్కరించే ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది.

Also Read: టాలీవుడ్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ 'డర్టీ పీఆర్ గేమ్స్'... రాజమౌళి నుంచి సందీప్ రెడ్డి వంగా వరకు... ఎవరెఎర్ని టార్గెట్ చేశారో తెలుసా?

'పెదవుల తడి...' పాటకు వస్తున్న స్పందన పట్ల హీరోయిన్ మిత్రా శర్మతో పాటు దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ పాటను అందంగా మలిచిందని చెప్పుకొచ్చారు. నటీనటుల కెమిస్ట్రీ తెర మీద చక్కని రొమాంటిక్ వైబ్‌ సృష్టించిందన్నారు. రాజ్ గురు ఫిలిమ్స్ అధినేత, చిత్ర నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ... ''వర్జిన్ బాయ్స్' సినిమా ఈతరం యువత ఆలోచనలు, వాళ్ళ భావోద్వేగాలను ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఒక సరికొత్త కాన్సెప్ట్ తీసుకుని ఈ సినిమా చేశాం. త్వరలో అది ఏమిటో రివీల్ చేస్తాం'' అని అన్నారు.

Also Read: 'ఆ నలుగురు' ఎవరు? అగ్ర నిర్మాతలేనా? ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారా?? వాళ్ళ చేతుల్లో ఏముంది??

Virgin Boys star cast and crew: గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్ తదితరులు నటించిన 'వర్జిన్ బాయ్స్' చిత్రానికి నిర్మాత: రాజా దరపునేని, నిర్మాణ సంస్థ: రాజ్ గురు ఫిలిమ్స్, సంగీతం: స్మరణ్ సాయి, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్, సాహిత్యం: పూర్ణ చారి.