'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా హిట్ సాధించి రూ.100 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యాడు యంగ్ హీరో నిఖిల్. ఈ సినిమా తర్వాత '18 పేజెస్' సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న నిఖిల్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు.


నిఖిల్ నటించిన తాజా చిత్రం 'స్పై' ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు మేకర్స్. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇక సినిమాని జూన్ 29న విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు మేకర్స్. అయితే ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్స్ కి చాలా టైం కావాలని, రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ చేయమని నిఖిల్ నిర్మాతకు చెబితే, అలా చేయనని.. ముందు అనౌన్స్ చేసినట్టే జూన్ 29న విడుదల చేస్తానని చెప్పాడంటూ, అప్పటి నుంచి నిఖిల్ - నిర్మాత మధ్య గొడవలు మొదలయ్యాలని ఇప్పటికే వార్తలు వచ్చాయి.


అయితే తాజాగా ఈ వార్తపై నిఖిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్పందించాడు. ఈ మేరకు నిఖిల్ మాట్లాడుతూ.. "ఔను, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. రిలీజ్ డేట్ ని వాయిదా వేయమని నిర్మాతలను కోరడం.. తనకు ఆందోళన కలిగించే విషయం. దాదాపు 2000 మంది ఈ చిత్రానికి పని చేశారు. కేవలం నిర్మాణం మాత్రమే కాకుండా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సాంకేతిక అంశాలు కూడా ఉన్నాయి. తక్కువ నాణ్యత మనందరిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి అవుట్ ఫుట్ గురించి నేను ఎక్కువగా ఆందోళన చెందాను. కానీ నిర్మాతలు సినిమా చూపించి.. నన్ను సంతృప్తి పరిచారు. అలాగే దర్శకుడు కూడా నన్ను చాలా సంతృప్తి పరిచారు. ఆ కారణంగానే ఈరోజు నేను ప్రమోషన్స్ కి కాస్త ఆలస్యమైనా ప్రెస్ మీట్ కి వచ్చి మరి ప్రమోట్ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను" అని ట్రైలర్ లాంచ్ వేడుకలో నిఖిల్ చెప్పుకొచ్చారు. నిఖిల్ మాటలను బట్టి నిర్మాతతో గొడవని వచ్చిన వార్తలు వాస్తవమే అని స్పష్టమవుతుంది.


అంతేకాదు సినిమాకి నాణ్యత అనేది ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా నిఖిల్ స్పష్టం చేశాడు. "ఈరోజు ఓ సినీ ప్రేక్షకుడు టికెట్ పై దాదాపు రూ.250 ఖర్చు చేస్తున్నాడు. మా నాణ్యత తక్కువగా ఉందని అతనికి కనిపిస్తే మార్నింగ్ షో తర్వాత థియేటర్స్ లో జనాలే ఉండరు. వాళ్లు సినిమా టికెట్ కోసం పెట్టిన డబ్బు వృథా అని భావించకూడదు. కాబట్టి మనం ప్రేక్షకులకు చూపించే సినిమా నాణ్యతగా ఉంటే ప్రేక్షకులు కూడా ఆ సినిమాని ఆదరిస్తారు" అని అన్నారు నిఖిల్. నిజం చెప్పాలంటే నిఖిల్ మాట్లాడే ప్రతి మాట సరైందే. ఎందుకంటే సినిమాకు నాణ్యత అనేది చాలా ముఖ్యం. ఆ నాణ్యత లేకపోతే అది సినిమా ఫలితంపై ప్రభావితం చూపిస్తుంది. మరి నిఖిల్ కోరుకునే బెస్ట్ అవుట్ పుట్ ని 'స్పై' మూవీ టీమ్ డెలివరీ చేసిందా? లేదా? అనేది జూన్ 29న సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Also Read: అల్లు అర్జున్ 'ఐకాన్' స్క్రిప్ట్‌తో నితిన్ మూవీ? అసలు విషయం ఇదే!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial