'వకీల్ సాబ్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించలేదు. నిజానికి వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ 'ఐకాన్' అనే ప్రాజెక్టు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు. రీసెంట్ గా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని చెప్పారు. కానీ దానిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. దాంతో 'ఐకాన్' ప్రాజెక్టు లేదని అంతా అనుకున్నారు. కానీ వేణు శ్రీరామ్ ఇప్పుడు అదే సినిమాని నితిన్ తో చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారట. 'వకీల్ సాబ్' కంటే ముందే అల్లు అర్జున్తో 'ఐకాన్' అనే ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు వేణు శ్రీరామ్. కానీ ఆ తర్వాత 'వకీల్ సాబ్' తో బిజీ అయిపోయాడు. దాంతో బన్నీ కూడా ఆ ప్రాజెక్టు పై ఇంట్రెస్ట్ చూపించలేదు. అటు వేణు శ్రీరామ్ కూడా ఐకాన్ ప్రాజెక్టు పక్కన పెట్టేశాడు.
అయితే తాజాగా వేణు శ్రీరామ్ తన నెక్స్ట్ మూవీకి స్టోరీ రెడీ చేసుకున్నారట. దాన్ని రీసెంట్ గా నితిన్ కి వినిపించాడట. నితిన్ కూడా కథ విని ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో వెంటనే ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ని వేణు శ్రీరామ్ రెడీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా లాంచ్ చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట వేణు శ్రీరామ్. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వేణు శ్రీరామ్ నితిన్ తో చేయబోయే ప్రాజెక్ట్ గతంలో అల్లు అర్జున్తో చేయాల్సిన 'ఐకాన్' ప్రాజెక్టే అని చెబుతున్నారు. కాకపోతే 'ఐకాన్' కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి నితిన్ ఇమేజ్కు సూటయ్యే విధంగా వేణు శ్రీరామ్ స్క్రిప్ ను రెడీ చేసినట్లు సమాచారం.త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.
తాజాగా తనకు 'భీష్మ' వంటి హిట్ అందించిన వెంకీ కుడుములతో సినిమా చేస్తున్నాడు. 'VNR Trio' వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీలో నితిన్ కి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైన షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ కెరియర్ లో 32వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట మూవీ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాకి హారీష్ జైరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Also Read: ఓటీటీలోకి ‘మళ్లీ పెళ్లి’ సినిమా - కోర్టును ఆశ్రయించిన నరేష్ భార్య రమ్య రఘుపతి!