Gaami First Day Box Office Collections: ఈమధ్య కాలంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కంటెంట్ ఇస్తున్నాయి. ఈ విషయం చాలామంది మూవీ లవర్స్ సైతం ఒప్పుకుంటారు. సినిమాలను థియేటర్లకు వెళ్లి చూడాలంటే స్టార్ హీరోలు ఉండాలి, భారీ బడ్జెట్‌తో తెరకెక్కాలి లాంటి అంచనాలు ఈరోజుల్లో ఎక్కువశాతం ప్రేక్షకులకు లేవు. అదే విషయాన్ని మరోసారి ‘గామి’ నిరూపించింది. విశ్వక్ సేన్ లాంటి ఒక యంగ్ హీరోను అఘోరగా చూపిస్తూ.. అతి తక్కువ బడ్జెట్‌తో విజువల్ వండర్‌ను క్రియేట్ చేశాడు దర్శకుడు విధ్యాదర్. దీంతో సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా ‘గామి’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు బయటికొచ్చాయి.
ఫస్ట్ డే కలెక్షన్స్..
విధ్యాదర్, విశ్వక్ సేన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గామి’.. మార్చి 8న థియేటర్లలో విడుదలయ్యింది. ఫస్ట్ షో నుండే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తక్కువ బడ్జెట్‌తో విజువల్స్‌ను అంత అద్భుతంగా ఎలా చూపించగలిగారు అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఒకేరోజు విడుదలయిన ఈ సినిమా.. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.07 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని మూవీ టీమ్ ప్రకటించింది. ఇక మూవీ విడుదలయ్యి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో మేకర్స్ కూడా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.
విశ్వక్ సేన్‌పై ప్రమోషన్స్ బాధ్యత..
‘గామి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి, రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసినప్పటి నుండి మూవీ టీమ్ ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడింది. అందరూ ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల నుండి కష్టపడ్డామని బయటపెట్టారు. దర్శకుడు విధ్యాదర్‌కు ఇది మొదటి సినిమా కావడంతో ప్రమోషన్స్ బాధ్యతలను విశ్వక్ సేన్ తీసుకున్నాడు. కుదిరినంత వరకు ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలని ప్రయత్నాలు చేశాడు. మూడేళ్లు తాము ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో చెప్పుకొచ్చాడు. ‘గామి’ టీమ్ చేసిన ప్రమోషన్స్ కంటే వారు టీజర్, ట్రైలర్‌లో సినిమా గురించి చూపించిన విజువల్సే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా చూడాలని అందరిలో ఆసక్తి మొదలయ్యింది.
కొత్త దర్శకుడే అయినా..
విధ్యాదర్ కాగితాకు ఇది మొదటి ఫీచర్ ఫిల్మే అయినా.. తను డైరెక్టర్‌గా పలు షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించాడు. వాటిని కూడా రొటీన్ కథతో కాకుండా డిఫరెంట్‌గా తెరకెక్కించి ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసిన ప్రతీ ఒక్కరి దగ్గర నుండి ప్రశంసలు పొందాడు. ఇప్పుడు ‘గామి’ విషయంలో కూడా అదే జరుగుతోంది. విశ్వక్ సేన్ లాంటి ఒక యంగ్, కమర్షియల్ హీరోను అఘోరగా చూపించడమే పెద్ద సాహసమని అందరూ అనుకున్నారు. కానీ తను చెప్పాలనుకుంటున్న కథను ఆడియన్స్‌కు అర్థమయ్యేలా చెప్పి, నటీనటుల నుండి తను ఎలాంటి యాక్టింగ్ కోరుకుంటున్నాడో అదే బయటికి తీసుకురాగలిగాడు విధ్యాదర్. ఇక విధ్యాదర్ టేకింగ్‌కు దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఫిదా అయ్యి ‘గామి’కి తన విషెస్ తెలిపారు.
Also Read: హిందీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన ‘హనుమాన్' - మరి తెలుగులో?