అంతర్జాతీయ స్థాయిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ ఎంత ఉందనేది చెప్పడానికి ఈ రోజు అమెరికాలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (Hollywood Critics Association - HCA Awards 2023) అవార్డుల కార్యక్రమం ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. హాలీవుడ్ దర్శక, నిర్మాతలకు ఇప్పుడు రామ్ చరణ్ ఫేవరెట్ అయ్యాడు.
చరణ్ పక్కన నిలబడటమే అవార్డు
'బెస్ట్ వాయిస్ ఆర్ మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్' కేటగిరీలో అవార్డు అనౌన్స్ చేయడానికి హాలీవుడ్ నటి ఎంజలీతో పాటు రామ్ చరణ్ వేదిక మీదకు వెళ్ళారు. ఆయన పక్కన ప్రజెంటర్‌గా నిలబడటమే అవార్డ్ విన్నింగ్ మూమెంట్ అని అని ఎంజలీ చెప్పారు. అందుకు బదులుగా రామ్ చరణ్ ఆమెకు థాంక్స్ చెప్పారు, నమస్కరించారు.
హెచ్.సి.ఎలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. స్టంట్స్, యాక్షన్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫిల్మ్, సాంగ్ విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే కాస్ట్ అండ్ క్రూకు హెచ్.సి.ఎ స్పాట్ లైట్ అవార్డు కూడా ఇచ్చారు. 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్' అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత ఎస్.ఎస్. రాజమౌళితో పాటు రామ్ చరణ్ కూడా వేదికపైకి వెళ్ళారు. ఇప్పుడు తాను ఈ వేదికపై మాట్లాడాలని అనుకోలేదని, మా దర్శకుడు తనకు తోడుగా తనను తీసుకు వచ్చారని తెలిపారు. ''నేను స్టేజి మీదకు రావాలని అనుకోలేదు. మా దర్శకుడికి కంపెనీ మాత్రమే ఇవ్వాలనుకున్నాను. మాపై ఇంత ప్రేమ, అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్. మేం మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన బాధ్యత మా మీద ఉంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది'' అని చరణ్ చెప్పారు.
ఏంజెలాతో సెల్ఫీ తీసుకోవాలని...
'బెస్ట్ వాయిస్ ఆర్ మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్' కేటగిరీలో అవార్డు అనౌన్స్ చేయడానికి ముందు ఇండియా నుంచి ఎనిమిది వేల మైళ్ళు ప్రయాణించి ఈ అవార్డు ప్రజెంట్ చేయడానికి వచ్చావా? అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు ఆయన ఏంజెలా బస్సెట్ (Angela Bassett) తో సెల్ఫీ కూడా తీసుకోవాలని వచ్చానని ఆయన చెప్పారు. అవార్డు కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత కూడా అదే విషయాన్ని ట్వీట్ చేశారు. హాలీవుడ్ క్రిటిస్ అసోసియేషన్ అవార్డుల్లో ఇండియాను రిప్రజెంట్ చేయడం సంతోషంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 'బ్లాక్ పాంథర్', 'బ్లాక్ పాంథర్ : వాఖండ ఫరెవర్', 'అవెంజర్స్ : ఎండ్ గేమ్' తదితర సినిమాల్లో ఏంజెలా బస్సెట్ నటించారు.
'నాటు నాటు...' చరణ్ నేర్పిస్తే?
హెచ్.సి.ఎ అవార్డుల వేదికపై కూడా 'నాటు నాటు...' సాంగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల గురించి డిస్కషన్ నడిచింది. ఆ సాంగులో హీరోలు చేసినట్టు డ్యాన్స్ చేయాలని ఉందని క్రిటిక్స్ మెంబర్ ఒకరు వ్యాఖ్యానించగా... ''రామ్ ఇక్కడ ఉన్నాడు కాదు! మనకు నేర్పిస్తాడు'' అని రాషా గోయెల్ తెలిపారు. రామ్ చరణ్ స్టైల్ కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది.
Also Read : అక్షయ్ కుమార్ పరువు తీసిన 'సెల్ఫీ' - పదేళ్ళలో వరస్ట్ ఓపెనింగ్!
ఇప్పుడు ఆస్కార్ అవార్డుల మీద అందరి చూపు, ముఖ్యంగా భారతీయ ప్రేక్షకుల చూపు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఆ అవార్డు వేడుకకు రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి తదితరులు వెళ్ళనున్నారు.
Also Read : వచ్చే వారమే మంచు మనోజ్ రెండో పెళ్ళి - ఏడడుగులు వేసేది ఎప్పుడంటే?