హారికా నారాయణ్... లేటెస్ట్ సెన్సేషనల్ సింగర్! గాయనిగా కెరీర్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో టైటిల్ సాంగ్ పాడినది ఈ అమ్మాయే. తమిళ స్టార్ విజయ్ 'వారసుడు'లో 'థీ దళపతి' పాట కూడా పాడారు. ఇలా చెబుతూ వెళితే హారికా నారాయణ్ పాడిన హిట్ సాంగ్స్ లిస్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఆమె ఓ చిన్న సినిమాలో పాట పాడారు. 


జీవితంలో ఏమీ సాధించలేని వ్యక్తిగా... లూజ‌ర్ కింద మిగిలిపోతున్న ఓ యువకుడు విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. అతని జీవితం ఓ ఆట మొదలవుతుంది. అది అతడిని ఏ తీరాలకు చేర్చింది? మధ్యలో ఏమైంది? అనే కథతో రూపొందిన సినిమా 'గేమ్ ఆన్' (Game On Movie). ఇందులో గీతానంద్ హీరో. నేహా సోలంకి (Neha Solanki) హీరోయిన్. ఇందులో పాటను హారికా నారాయణ్ ఆలపించారు. 


ప్రేమలో పడిపోతున్నా...
'పడిపోతున్నా... నిన్ను చూస్తూనే!  పడిపోతున్నా... ప్రేమలోనే!' అంటూ సాగే గీతాన్ని హారికా నారాయణ్, స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటకు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. అశ్విన్, అర్జున్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రెండో పాట ఇది.


Also Read : 'ఆర్ఆర్ఆర్'కు ఏడాది - సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా?



'గేమ్ ఆన్'లో మొదట పాట 'రిచో రిచ్'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆల్మోస్ట్ 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ పాటకు లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చిత్ర బృందం తెలిపింది. 


ఎమోషనల్ 'గేమ్ ఆన్'
'గేమ్ ఆన్' చిత్రాన్ని (Game On Movie) క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ పతాకాలపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా సినిమాను రూపొందించామని దర్శక నిర్మాతలు తెలిపారు.


''ఆల్రెడీ విడుదలైన రెండు పాటలు, టీజర్, ప్రచార చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. దాంతో సినిమాపై మాకు నమ్మకం ఏర్పడింది. కొత్తదనంతో కూడిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. మా సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్ చేస్తున్నారు. మా గీతానంద్, దర్శకుడు దయానంద్ అన్నదమ్ములే. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం'' అని నిర్మాత ర‌వి క‌స్తూరి చెప్పారు. ''రొటీన్ సినిమాలకు భిన్నమైన కథతో తీసిన చిత్రమిది. ఈ సినిమాలో చాలా ట్విస్టులు, ట‌ర్నులు ఉన్నాయి. యాక్ష‌న్‌, రొమాన్స్, ఎమోష‌న్స్... అన్ని అంశాలు ఉన్నాయి. మా కథ నచ్చి సినిమా చేయడానికి వచ్చిన నిర్మాతకు థాంక్స్'' అని  దర్శకుడు ద‌యానంద్ అన్నారు.


Also Read ప్రతి నటుడి జీవితమిది, సెకండాఫ్ అంతా కంటతడి - 'రంగమార్తాండ'కు మెగా కాంప్లిమెంట్స్ 


ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, 'బిగ్ బాస్' వాసంతి కృష్ణన్, కిరిటీ, 'శుభ‌లేక' సుధాక‌ర్‌ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు : క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్‌, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎడిట‌ర్ : వంశీ అట్లూరి, స్టంట్స్‌:  రామ‌కృష్ణ‌న్‌, న‌భా స్టంట్స్‌, సంగీతం : న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌, నేపథ్య సంగీతం : అభిషేక్ ఎ.ఆర్‌ మాటలు :  విజ‌య్ కుమార్ సిహెచ్‌, ఛాయాగ్రహణం :  అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌, నిర్మాత‌ : ర‌వి క‌స్తూరి, ద‌ర్శ‌క‌త్వం : ద‌యానంద్‌.