'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా (RRR Movie) విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, నిన్న మొన్ననే సినిమా విడుదల అయిన ఫీలింగ్ కలుగుతోంది. అందుకు రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి... సినిమాకు వస్తున్న అవార్డులు. రెండు... ప్రపంచంలో ఏదో ఒక ఏరియాలో సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ ఉండటం. 


థియేటర్లలో ఇంకా ఆడుతున్న 'ఆర్ఆర్ఆర్'
'ఆర్ఆర్ఆర్' విడుదలై ఏడాది కావచ్చు. కానీ, ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఇంకా జపాన్ దేశంలో కొన్ని థియేటర్లలో ఇంకా ప్రదర్శింపబడుతోంది. ఆస్కార్ అవార్డ్ రావడానికి ముందు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రీ రిలీజ్ చేస్తే... హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ వచ్చాయి. 


'ఆర్ఆర్ఆర్' సినిమా కాదు...
ఇండియన్స్ ప్రైడ్ మూమెంట్!
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' మాత్రమే కాదు... ఇండియన్స్ అందరికీ ప్రైడ్ మూమెంట్. 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ రావడం, అంతకు ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో దేశం అంతా సంబరం చేసుకుంది. 


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రానికి ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ మాత్రమే కాదు... ఇంకా చాలా అవార్డులు వచ్చాయి. ఏయే అవార్డులు వచ్చాయి అనేది ఒక్కసారి చూస్తే... 


Also Read : ప్రతి నటుడి జీవితమిది, సెకండాఫ్ అంతా కంటతడి - 'రంగమార్తాండ'కు మెగా కాంప్లిమెంట్స్






'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత హీరోలు, దర్శకుడు చేస్తున్న సినిమాలు ఏమిటి? అనేది చూస్తే... ఆల్రెడీ 'ఆచార్య'లో రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర చేశారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, 'దిల్' రాజు నిర్మాణంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత కన్నడ దర్శకుడు నర్తన్ సినిమా లైనప్ లో ఉందని సమాచారం. 


ఎన్టీఆర్ విషయానికి వస్తే... ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల సినిమా ప్రారంభించారు. అందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఆ సినిమా సెట్స్ మీద ఉంది. మృగాలను వేటాడే మగాడిగా ఎన్టీఆర్ రోల్ ఉంటుందని సినిమాపై కొరటాల హైప్ పెంచేశారు. ఆ సినిమా తర్వాత 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. అందువల్ల, ఆయన కూడా ఫుల్ బిజీ. 


రాజమౌళి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా చేయనున్నారు. అది అడ్వెంచర్ సినిమా అని ఆల్రెడీ చెప్పేశారు. ఆఫ్రికా నేపథ్యంలో ఆ సినిమా సాగుతుందని రాజమౌళి తండ్రి, విజయేంద్ర ప్రసాద్ కూడా చెప్పారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో మహేష్, రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేసే అవకాశం ఉంది.


Also Read నువ్వు మారవా విష్ణు? - మంచు బ్రదర్స్ గొడవలో శాక్రిఫైజింగ్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్ 
 
'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. 'టైటానిక్', 'అవతార్' సినిమాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ అయితే ''ఇక్కడ (హాలీవుడ్) సినిమా చేసే ఉద్దేశం ఉంటే చెప్పు'' అని రాజమౌళి చెవిలో చెప్పారు. ఆ సినిమా ఓకే కావాలని రాజమౌళి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.