జూన్ 12వ తేదీన 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) థియేటర్లలోకి రావడం పక్కా. అందులో మరో సందేహం లేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేయడానికి డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. మరి పవన్ నిర్మాత అడిగిన రేటు వస్తుందా? లేదా? అనేది చూడాలి.
వీరమల్లు నైజాం రైట్స్ రేటు 50 కోట్లు!?పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు నైజాంలో బలమైన మార్కెట్ ఉంది. ఆయనకు తెలంగాణలో ఫాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇక్కడ ఆయన మూవీస్ కలెక్షన్స్ బావుంటాయి. అందుకని థియేట్రికల్ రైట్స్ రేటు 50 కోట్లకు అటు ఇటుగా కావాలని నిర్మాత ఏయం రత్నం చెబుతున్నారట. ప్రస్తుతం నైజాం డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఎంత రేటుకు ఫైనల్ అవుతుందనేది చూడాలి.
'హరి హర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించారు. బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్, 'డాకు మహారాజ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాబి డియోల్ సైతం సినిమాలో నటించారు. ఆయనది ఔరంగజేబు పాత్ర. పవన్ నటించిన హిస్టారికల్ ఫిలిం కావడం, అందులోనూ దొరలను దోచి పేదలకు న్యాయం చేసే రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ చేస్తూ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
Also Read: టాలీవుడ్ 'కింగ్ పిన్'కు పవన్ కళ్యాణ్ చెక్‌మేట్... చిన్న గూగ్లీకి హడల్... దెబ్బకు సెట్టయ్యారా?
'హరి హర వీరమల్లు' చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరు అవుతారని తెలిసింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని ప్రేక్షకులు సైతం చాలా నిశితంగా గమనిస్తున్నారు.
Also Read: థియేటర్స్ బంద్ కుట్ర వెనుక ద్వారంపూడి... వైసీపీ ఆటలో 'ఆ నలుగురు' పావులు అయ్యారా?