Sankranti 2024: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజైన భోగి పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ వేడుకలు అంబరాన్ని అంటాయి. పల్లెలు, పట్టణాలు భోగి సంబరాల్లో మునిగితేలుతున్నాయి. భోగి మంటలు, హరిదాసు, గంగిరెద్దులు, డీజే పాటలతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతుంది.  


సామాన్య ప్రజలే కాదు సినీ,రాజకీయ ప్రముఖులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకుని వాటి చూట్టూ ఆటపాలతో సందడి చేస్తున్నారు. ఇక సినీ సెలబ్రెటీలు కూడా భోగి మంటలు వేసి పండగను ఆహ్వానించారు. కుటుంబంతో కలిసి హ్యాపీ భోగి సంబరాల్లో మునిగితేలుతున్న ఫొటోలను షేర్‌ చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


ఎన్టీఆర్‌ భోగి విషెస్‌


గ్లోబల్‌ స్టార్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. అందరికి భోగి మరియు సంక్రాంతి శభాకాంక్షలు అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. 






వెంకీమామ భోగి సందడి


విక్టరి వెంకటేష్‌ కూడా పండగ సంబరాల్లో మునిగితేలుతున్నారు. వేకువజామునే వేసిన భోగి మంట చూట్టూ డ్యాన్స్‌ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ 'హ్యాపీ భోగి' అని విష్‌ చేశారు. కాగా వెంకటేష్‌ నటించిన 'సైంధవ్‌' మూవీ నిన్న థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. హిట్‌ కొడుతుందనుకుంటే యావరేజ్‌ రివ్యూస్‌ అందుకుంది. సైకో సైంధవ్‌గా వెంకీమామ నటన ఆకట్టుకున్నప్పటకీ స్టోరీ, నరేషన్‌ రోటిన్‌గా ఉందంటున్నారు. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎలివేట్‌ చేయడంలో  డైరెక్టర్‌ తడబడ్డాడనిపిస్తోందంటూ ఆడియన్స్‌ అభిప్రాయపడుతున్నారు.  


Also Read: మీకు తెలుసా? నేనే కాదు.. నా భర్త కూడా ప్రెగ్నెంటే! అమలాపాల్‌ షాకింగ్‌ పోస్ట్‌


భోగి సంబరాల్లో జక్కన్న ఫ్యామిలీ


దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి భోగి పండగ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. వేకువ జామునే కుటుంబంతో కలిసి భోగి మంటలు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో షేర్‌ చేస్తూ అందరికి భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు. 







భోగి మంటల ఫొటో షేర్‌ చేసిన నాని


నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం హాయ్‌ నాని మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అదే జోష్‌తో నెక్ట్స్‌ సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఈ సందర్భంగా అందరికి భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంట్రెస్టింగ్‌ ఫొటో షేర్‌ చేశాడు. ఇందులో నాని భోగి మంటల ముందు ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించాడు. చూస్తుంటే ఇది తన నెక్ట్స్‌ మూవీకి సంబంధించిన లుక్‌లా అనిపిస్తోంది. అలాగే సీనియర్‌ హీరోయిన్‌, నటి ప్రియమణి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా ఫ్యాన్స్‌కి పండుగ విషెస్‌ తెలిపారు.