భారీ సినిమాలు తీయడం హాలీవుడ్, బాలీవుడ్ దర్శకుల వల్లనే అవుతుందనుకునే దక్షిణాది ప్రేక్షకుల ఆలోచనను యూటర్న్ తీసుకునేలా చేసిన దర్శకుడు శంకర్. మెగాఫోన్ పట్టుకుని అడుగుపెడుతూనే అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చేసిన దర్శకుడాయన. శంకర్ మూవీస్ లో కమర్షియల్ అంశాలతోపాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. 90వ దశాబ్దంలో గ్రాఫిక్స్ ను ఇండియన్ తెరపై ఆవిష్కరించి సంచలనాలకు నెలవుగా మారిన దర్శకుడు.


Also Read: ఇష్క్‌బాయ్‌ని బెదిరిస్తోన్న మిల్కీ బ్యూటీ.. చూపులతో కాదు తుపాకీతో..


1993లో 'జెంటిల్ మేన్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కొత్త కుర్రాడు.. ఉత్సాహంతో ఏదో ట్రై చేసే ఉంటాడని అంతా అనుకున్నారు. అలాంటి వాళ్లంతా సినిమా చూసి షాక్ అయ్యారు. అప్పటివరకూ తెరపై వాళ్లు చూసిన సినిమాల్లా అనిపించలేదు  'జెంటిల్ మేన్'. కథ, స్క్రీన్ ప్లే.. పాత్రలను మలిచిన విధానం, రీ రికార్డింగ్ లో కొత్తదనం.. సంగీతం, పాటలు, ఫైట్లు.. డాన్సులు ఇలా ప్రతి  ప్రతి అంశంలో కొత్తదనాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆ సినిమా ఏ భాషలో విడుదలైతే ఆ భాషలో కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పడు అందరిలోనూ మొదలైన ఒకే ఒక ప్రశ్న 'ఎవరీ శంకర్?'. ఒక్కసారిగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయిపోయాడు.


Also Read: గెడ్డం, మీసాలతో అనుపమా హల్‌చల్.. సెక్సీ దుస్తుల్లో పూజా హెగ్డే, రాశీఖన్నా రచ్చ!




ఆగస్టు 17 న కుంభకోణంలోని ఓ చిన్న గ్రామంలో షుణ్ముగం, ముత్తులక్ష్మీ కి జన్మించిన శంకర్ కి... చదువంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయినా తండ్రి బలవంతం మేరకు చెన్నైలోని సీపీటీ నుంచి డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత  స్టార్ నటుడు, ఇళయదళపతి విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించాడు. ఎ.ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో జెంటిల్మెన్ లాంటి భారీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. జెంటిల్మెన్ కోసం  మొదట్లో రజనీకాంత్ ని ఎంపిక చేసుకున్నప్పటికీ దర్శకుడు కొత్తవాడు అనే కారణంతో రజనీ నో చెప్పాడట. ఈ విషయాని రజనీయే చాలా సార్లు ఓపెన్ గా చెప్పటం విశేషం. అప్పుడా అదృష్టం అర్జున్ వైపు టర్న్ అయింది. పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.


Also read: స్టార్ హీరోలా..అయినా తగ్గేదేలే అంటున్న లీకువీరులు..సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ పెద్దలు


"ఏదో టైమ్ బాగుండి జెంటిల్మెన్  సినిమాకు అన్నీ కలిసొచ్చాయి.. మరో సినిమా చేస్తేనే గాని ఆయన గారి టాలెంటును గురించి ఏమీ చెప్పలేం " అని విమర్శించిన వారూ ఉన్నారు. ప్రశంసలను- విమర్శలను పట్టించుకోని శంకర్ మరో సాహసం చేశాడు. తన మొదటి సినిమాలో డాన్సర్ గా ఒక పాటలో మెరిసిన ప్రభుదేవాను 'ప్రేమికుడు' లో హీరోగా తీసుకున్నారు. రికార్డుల పరంగా ఈ సినిమా మోత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.


Also Read: రాజ రాజ చోర, తరగతి గది దాటి, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరీస్ 9 సహా ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో తెలుసా....


ఆ తరువాత శంకర్ నుంచి వచ్చిన 'భారతీయుడు' సినిమా భారతదేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసింది. తాను ఎంచుకున్న కథ పట్ల శంకర్ ఎంత నమ్మకంగా ఉంటాడు? కథనాన్ని నడిపించడంలో ఆయన ప్రత్యేకత ఏమిటి? పాత్రల రూపకల్పనలో చూపించే కొత్తదనం ఎలా ఉంటుందనేది అందరికీ అర్థమైంది. ట్యూన్లు చేయించుకోవడంలోను .. రాయించుకోవడంలోను ఫైట్లు కంపోజ్ చేయించుకోవడంలోను  ఎంతో అవగాహన ఉందనేది వారికి స్పష్టమైంది.




'జీన్స్' సినిమా చూస్తే.. ఇంతవరకూ ద్విపాత్రాభినయాన్ని ఆ స్థాయిలో తీసినవాళ్లెవరూ కనిపించరు. అలాగే 'రోబో' లో  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లలకు కూడా అర్థమయ్యేలా తెరకెక్కించిన ఘనత శంకర్ కే చెల్లింది. నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే శంకర్ పై వాళ్లకి ఏ స్థాయిలో నమ్మక ఉందో ఊహించుకోవచ్చు. తాను అనుకున్నది తెరపై చూపించాడనికి తపస్సు చేస్తాడు శంకర్.


శంకర్ సినిమాల్లో కోర్టు సీన్లు కామన్. సామాజిక అంశాలను జనాలను హత్తుకునేలా రూపొందించడంలో దిట్ట. ఒకే ఒక్కడుగా ఒక్క రోజు సీఎం పాత్రలో అర్జున్‌ని ఆవిష్కరించాడు. అపరిచితుడితో విక్రమ్ ఫేట్ ను మార్చేశాడు. రోబోలో రజనీలోని మరో కోణాన్ని ప్రేక్షకులను పరిచయం చేశాడు. ఓవైపు మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు సామాజిక అంశాలను కూడా అందించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఒకటి రెండు సినిమాలు మినహా శంకర్ సినిమాలు టీవీల్లో ఎప్పుడు వచ్చినా ఇప్పటికీ ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతారంటే అతిశయోక్తి కాదు.


Also Read: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?


దక్షిణాది సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన శంకర్ ప్రస్తుతం చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఆగస్టు 17 శంకర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఏబీపీ దేశం....