Hanuman: ఈ ఏడాది సంక్రాంతికి చిన్న సినిమాగా బరిలో దిగి, పెద్ద విజయం సాధించిన చిత్రం 'హను-మాన్'. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక ఓవర్ సీస్ లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా లేదు. యూఎస్ఏలో ఎవరూ ఊహించని రేంజ్ లో వసూళ్లను కొల్లగొడుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోల రికార్డులను సైతం బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
'హనుమాన్' సినిమా తెలుగు తమిళ హిందీ కన్నడ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందులో హిందీ వెర్షన్ రూ. 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నార్త్ అమెరికాలో 3.64 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి, అక్కడ ఆల్-టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్-5 తెలుగు సినిమాల క్లబ్ లో చేరింది. ఈ క్రమంలో 'అల వైకుంఠపురములో', 'రంగస్థలం', 'భరత్ అనే నేను', 'సాహో', 'ఆదిపురుష్' వంటి సినిమాల వసూళ్లను క్రాస్ చేయడం గమనార్హం.
ఓవర్సీస్ టాప్-10 గ్రాసర్ లిస్టులో చేరడానికి మన అగ్ర హీరోలు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికి ఉత్తర అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాగా 'బాహుబలి 2' ($20.76 మిలియన్) టాప్ లో నిలిచింది. RRR, 'సలార్', 'బాహుబలి 1' చిత్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. $ 3.63 మిలియన్లతో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రం 5వ ప్లేస్ లో ఉండగా, ఇప్పుడు 'హను-మాన్' మూవీ దాన్ని క్రాస్ చేసి ప్రతిష్టాత్మక క్లబ్‌లో టాప్-5 లో నిలిచింది. అది కూడా విడుదలైన 8 రోజుల్లో తేజ సజ్జా లాంటి ఒక చిన్న హీరో, $12 టిక్కెట్ ధరతో ఈ ఘనత సాధించడం విశేషమనే చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ సినిమా 5 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఓవర్సీస్ ఆల్-టైమ్ హయ్యెస్ట్ టాప్-10 గ్రాసర్స్(తెలుగు):
బాహుబలి 2 - $ 20.76 మిలియన్
RRR - $ 14.83 మిలియన్
సలార్ - $ 8.9 మిలియన్
బాహుబలి 1 - $ 8.47 మిలియన్
హను-మాన్ - $ 3.64 మిలియన్ (ప్రస్తుతానికి..)
అల వైకుంఠపురములో - $ 3.63 మిలియన్
రంగస్థలం - $ 3.51 మిలియన్
భరత్ అనే నేను - $ 3.4 మిలియన్
సాహో - $ 3.23 మిలియన్
ఆదిపురుష్ - $ 3.16 మిలియన్
'జాంబీ రెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా కలయికలో వచ్చిన సినిమా 'హనుమాన్'. ఈ ఫస్ట్ పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించగా.. వినయ్ రాయ్ విలన్ గా నటించారు. సముద్రఖని, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. గౌరహరి సంగీతం సమకూర్చగా.. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
Also Read: 'గేమ్ ఛేంజర్' అప్డేట్ - దసరాని టార్గెట్ గా పెట్టుకున్న రామ్ చరణ్?