HanuMan outshines RRR and Baahubali movies record in the USA: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన 'హనుమాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్కి, తేజ సజ్జ యాక్టింగ్కి ప్రతీ ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. థియేటర్స్ అంతా జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి. 'మనిషికి సంకల్పబలం ఉంటే విశ్వంలో ఉన్న అన్ని శక్తులు ఏకమై అతన్ని విజయతీరాలకు చేరుస్తాయి' అనే మాటకి ప్రత్యక్ష నిదర్శనంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.


ఓవర్సీస్ లో అయితే హనుమాన్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ దాటి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా ఆడియన్స్ 'హనుమాన్'కి చూపిస్తున్న ఆదరణ అంతా అంతా కాదు. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా మూడు మిలియన్ డాలర్ల మార్క్ రీచ్ అయ్యి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో నార్త్ అమెరికాలో హైయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్ లో ఒకటిగా హనుమాన్ చోటు సంపాదించుకుంది. స్టార్ హీరోల లైఫ్ టైం కలెక్షన్లను కేవలం నాలుగు రోజుల్లోనే క్రాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి హనుమాన్ ర్యాంపేజ్ అక్కడ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.


నార్త్ అమెరికాలో ఫస్ట్ సండే హనుమాన్ 525K డాలర్లు వసూలు చేసి రాజమౌళి RRR, బాహుబలి రికార్డ్స్ ని పటాపంచలు చేసేసింది. అక్కడ సినిమాకి భారీ రెస్పాన్స్ రావడంతో మరిన్ని స్క్రీన్స్ జోడిస్తున్నారు. దీంతో నార్త్ అమెరికాలో హనుమాన్ కలెక్షన్స్ రోజురోజుకీ మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదే జరిగితే అన్ని సినిమాల రికార్డ్స్ ని హనుమాన్ బ్రేక్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఓవర్సీస్ లో మహేష్ బాబు కలెక్షన్స్ పరంగా టాప్ లో ఉన్నారు.


మహేష్ నటించిన 'భరత్ అనే నేను' అక్కడ 3.41 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఒకవేళ 'హనుమాన్' కనుక మరో హాఫ్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తే 3.5 మిలియన్ డాలర్లు తో మహేష్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయినట్లే అని చెప్పొచ్చు. మరి ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు హనుమాన్ అక్కడ ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇండియన్ సూపర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా గౌర హరి, కృష్ణ సౌరబ్, అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.


Also Read : లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి జంటగా తెలుగులో కొత్త సినిమా - టైటిల్‌ ఏంటో, దర్శకుడు ఎవరో తెలుసా?