Guntur Kaaram OTT: సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ఒకటి 'గుంటూరు కారం'. మొదట మిక్స్‌డ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మహేశ్‌బాబు వన్‌మ్యాన్‌ షో చేశారు. తన డ్యాన్స్‌, ఫైటింగ్‌తో ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. ఇక 'ఆ కుర్చీని మడతబెట్టి' సాంగ్‌ గురించైతే చెప్పక్కర్లేదు. దాంట్లో హీరోయిన్‌ శ్రీలీల, మహేశ్‌బాబు ఇరగదీశారు. ఇక ఆ సాంగ్‌ కూడా తెగ వైరల్‌ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ పవర్‌ప్యాక్‌ పర్ఫామెన్స్‌ సినిమా ఓటీటీలోకి రానుంది. జనవరి 12న రీలీజైన ఈ సినిమాని ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయనున్నట్లుగా ఇప్పటికే వార్తుల వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అయితే, ఇప్పుడు ఆ ఓటీటీకి వెర్షన్‌కి సంబంధించి ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు యాడ్‌ చస్తున్నట్లు తెలుస్తోంది. 


వీడియోసాంగ్‌, కొన్ని సీన్లు.. 


'గుంటూరు కారం' సినిమా రన్‌టైమ్‌ 159 నిమిషాలు. అయితే, ఓటీటీలో మాత్రం ఆ సమయం పెరగనుందని సమాచారం. కారణం.. సినిమాలో అమ్మ పాట, కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించి కొన్ని యాక్షన్‌ సీన్లను యాడ్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా.. సినిమాలో అమ్మ పాట, కబడ్డీ సీన్లు కట్‌ చేశారట. దీంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో వాటిని యాడ్‌ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడిక ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు డ్యాన్స్‌, ఆయన యాక్టింగ్‌తో ఉర్రూతలూగించాడని, ఇక ఇప్పుడు ఎక్స్‌ట్రాగా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ సీన్లు అంటే ఇక పూనకాలే అంటున్నారు.


స్ట్రీమింగ్ ఎప్పుడు?


జనవరి 12న రిలీజైన 'గుంటూరు కారం' సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన శ్రీ లీల నటించింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా మహేశ్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజైన 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల వరకు గ్రాస్‌ను, రూ.122 కోట్లకుపైగా షేర్‌ వసూలు చేసింది. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రిలీజ్‌పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్తలు మాత్రం ప్రచారం అవుతున్నాయి. 


రాజమౌళితో మూవీకి సన్నహాలు


ఇక మహేశ్‌బాబు ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్నారు. అది పాన్ వరల్డ్ సినిమా కావడం విశేషం. ఇక ఆ సినిమా కోసమే మహేశ్బాబు రీసెంట్గా జర్మనీ కూడా వెళ్లారు. అంతేకాకుండా ఉగాదికి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ను జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్ల బడ్జె‌ట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమాకి మహేశ్‌బాబు రెమ్యునరేషన్‌ తీసుకోవడం లేదని, సినిమా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాజమౌళి సినిమా అంటే టైంతో కూడుకున్న పని, చాలాకాలం తెరకెక్కిస్తారు. మరి మహేశ్‌ బాబు నటించే ఈ సినిమా ఎప్పటికి రిలీజ్‌ అవుతుందో అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఏం రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి మరి అంటున్నారు.


Also Read: ఆ విషయంలో ‘RRR’ని దాటేసిన 'హనుమాన్‌'