సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో కానీ, మొదటి నుంచీ ఏదొక రూపంలో అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. షూటింగ్ క్యాన్సిల్ కావడమో, వాయిదా పడటమో, కథలో మార్పులు జరగడమో, హీరోయిన్ లేదా టెక్నీషియన్లు మారడమో జరుగుతూనే వస్తోంది. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ను మారుస్తున్నారనే రూమర్స్ వచ్చాయి. అయితే సంగీత దర్శకుడి సమస్య ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 


'గుంటూరు కారం' సినిమాకి ఎస్. థమన్ (Thaman Music Director)ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్వరపరిచిన అనౌన్స్ మెంట్ వీడియో మరియు 'గుంటూరు కారం' గ్లిమ్స్ బీజీఎమ్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఉన్నట్టుండి మ్యూజిక్ డైరెక్టర్ ను మారుస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అంతేకాదు థమన్ స్థానంలో మలయాళ సంగీత దర్శకుడు అబ్దుల్ వాహిబ్ ను తీసుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చేసాయి. ఇంకో అడుగు ముందుకేసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరీలియో చేత శాంపిల్ గా ఓ పాట చేయించారని ప్రచారం చేసారు. ఈ నేపథ్యంలో థమన్ నే కంటిన్యూ చేస్తున్నారని తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


'గుంటూరు కారం' మూవీ కోసం త్రివిక్రమ్ - తమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఐదు పాటలతో పాటుగా, రెండు లేదా మూడు బిట్ సాంగ్స్ ఉంటాయట. కాకపోతే సాంగ్స్ రెడీ కాకపోవడంతో, ముందుగా టాకీ పార్ట్ షూటింగ్ మీదే పూర్తి దృష్టి పెట్టారని భావించారట. దీనికి తగ్గట్టుగానే ఆగస్టు ఫస్ట్ వీక్ లో మహేష్ బాబు అవసరం లేని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ ఇప్పుడు ముందు సాంగ్ షూటింగ్ కు వెళ్లాలని అనుకుంటున్నారట. దీని కోసం ఇప్పుడు థమన్ ట్యూన్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.


Also Read: డిసెంబర్‌లో ఈసారి తగ్గేదేలే.. బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్న క్రేజీ చిత్రాలు!


మహేష్ బాబు ప్రస్తుతం విదేశాల్లో వున్నారు. ఆయన ఇండియా తిరిగి రాగానే పాట చిత్రీకరణ ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఆలోపు థమన్ సాంగ్ ను రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. కృష్ణ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మాస్ స్ట్రైక్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ బీజీఎమ్, త్రివిక్రమ్ లిరిక్స్, రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ ప్రత్యేకంగా నిలిచాయి. 'గుంటూరు కారం' లోని అన్ని పాటలు కూడా అదే రేంజ్ లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


గతంలో మహేష్ కు 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'ఆగడు' వంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించాడు థమన్. 'సర్కారు వారి పాట' మ్యూజిక్ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, 'కళావతి' లాంటి మంచి సాంగ్ కంపోజ్ చేసాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'గుంటూరు కారం' చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అందులోనూ ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమా. వీరి కలయికలో 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' వంటి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. అందుకే రాబోయే మూవీ ఆల్బమ్ అంతకుమించి ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. 


Also Read: తమిళ దర్శకులతో పవన్ కళ్యాణ్ - హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయి బ్రో!


దీనికి తోడు ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ను తప్పిస్తున్నారనే వార్తలు, థమన్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చలు జరిగేలా చేసాయి. కాబట్టి ఈసారి కచ్చితంగా తన స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరముంది. ఇది థమన్ మీద మరింత ఒత్తిడి పెంచే విషయమనే అనుకోవాలి. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా, మహేశ్ బాబు మూవీకి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టార్ కంపోజర్ నుంచి ఎలాంటి మ్యూజిక్ వస్తుందో వేచి చూడాలి.



కాగా, 'గుంటూరు కారం' అనేది మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీ లీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు కావడంతో ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రావొచ్చు.


Also Read : ఇదీ మహేష్ బాబు క్రేజ్ - గంటలో హౌస్‌ఫుల్ బోర్డ్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial