బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించిన తాజా చిత్రం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ'. రణవీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు.  ఈ మూవీలో సీనియర్ నటులు జయా బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కీలక పాత్రలు పోషించారు. సుమారు 7 సంవత్సరాల తర్వాత కరణ్ దర్శకత్వంలో  రూపొందిన ఈ సినిమా, జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.  


ధర్మేంద్ర, షబానా మధ్య ముద్దు సీన్!


ఇక ఈ సినిమాలో ధర్మేంద్ర, షబానా మధ్య ముద్దు సీన్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మూవీలో వీరిద్దరి మధ్యన ఓ పాట ఉంటుంది. పాట కొనసాగుతుండగా వీరిద్దరు ముద్దు పెట్టుకుంటారు. ఈ సీన్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు.  ఈ వయసులో ముద్దులు ఏంటి నాయనా? అంటూ నవ్వుకున్నారు. కొందరు ఈ సీన్ పై పాజిటివ్ గా స్పందిస్తుంటే, మరికొంత మంది విమర్శలు చేస్తున్నారు.


రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు- ధర్మేంద్ర


తాజాగా 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' సినిమాలోని తమ ముద్దు సన్నివేశంపై ధర్మేంద్ర రెస్పాండ్ అయ్యారు. తమ ముద్దు సీన్ ఉంటుందని ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరని చెప్పారు. అందుకే ఈ సీన్ పట్ల ఆడియెన్స్ నుంచి చాలా రెస్పాన్స్ వస్తోందన్నారు. “ షబానా అజ్మీ, నేను ముద్దు సీన్ లో నటించడం ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. చాలా మంది ఈ సీన్ చూసి క్లాప్స్ కొట్టారు. తమ నుంచి ఊహించని సన్నివేశం రావడంతో ప్రేక్షకుల నుంచి పెద్ద రెస్పాన్స్ వస్తోంది. రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు. వయసు అనేది అడ్డురాదు. ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే. ముద్దు ద్వారా ఏ వయసు వాళ్లు అయినా తమ ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ముద్దు సీన్ ఉంటుందని దర్శకుడు కరణ్ ముందుగానే చెప్పాడు. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. సినిమాలో ముద్దు సీన్ కు ఉన్న ఇంపార్టెన్స్ నాకు, షబానాకు కరణ్ వివరించాడు. ఆయన చెప్పిన విధానం నచ్చి ఒప్పుకున్నాం. ఈ సీన్ చేస్తున్నప్పుడు మేం ఎలాంటి ఇబ్బంది పడలేదు” అని చెప్పారు.


అటు ఈ సందర్భంగా తన గత ముద్దు సీన్ గురించి కూడా ధర్మేంద్ర వివరించే ప్రయత్నం చేశారు. “ఈ సినిమా కంటే ముందు కూడా ఓ సినిమాలో ముద్దు సీన్ చేశాను. “లైఫ్‌ ఇన్‌ ఎ మెట్రో” మూవీలో నఫీసా అలీతో కిస్ సీన్ చేశాను. అప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని ముద్దు సీన్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసింది” అని వివరించారు.


Read Also: మట్టితో బొమ్మలు, ఫ్రెండ్స్‌ తో సమంత సరదాలు- బాలిలో జాలీగా గడుపుతున్న సామ్


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial