బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోవిందా స్వయంగా తెలియజేశారు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన కొన్ని గంటల తర్వాత ఇన్ స్టాగ్రామ్ వేదికగా గోవిందా ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ వీడియోలో గోవింద మాట్లాడుతూ.. "నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. హర్యానా హింసకు సంబంధించిన ట్వీట్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ట్వీట్ ని నేను పోస్ట్ చేయలేదు" అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హర్యానాలో హింసాత్మక పనులు కొనసాగుతున్న నేపథ్యంలో హింసకు సంబంధించి నటుడు గోవిందా ట్విట్టర్ అకౌంట్ లో కొన్ని ట్వీట్స్ తో పాటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొంత సమయానికి గోవిందా ట్విట్టర్ ఖాతా ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అయితే తాజాగా ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఆ స్క్రీన్ షాట్స్ లో ఉన్న దాని ప్రకారం.. "మనం దేనికి వచ్చాం? హిందువులమని చెప్పుకొని ఇలాంటి పనులు చేసే వాళ్ళు సిగ్గుపడాలి. మనది ప్రజాస్వామ్యం. నిరంకుశత్వం కాదు" అని ఆ పోస్ట్ లో ఉంది. అయితే దీనిపై స్పందించిన గోవిందా తన ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో గోవింద మాట్లాడుతూ.. "నా స్నేహితులు, అభిమానులైన హర్యానా ప్రజలందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే.. ఎవరో నా ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేశారు. నేను చాలా సంవత్సరాలుగా ట్విట్టర్ అకౌంట్ ని ఉపయోగించడం లేదు. నా సోషల్ మీడియా టీం కూడా వాళ్ళు ఎలాంటి ట్వీట్ చేయలేదు’’ అని ధృవీకరించారు. ‘‘నన్ను అడగకుండా వాళ్ళు ఎటువంటి పోస్ట్ పెట్టరు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.






ఇక ఇదిలా ఉంటె సోమవారం విశ్వహిందూ పరిషత్ చేపట్టిన యాత్రలో భాగంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎలాగైనా ఆ యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించిన ఓ బృందం యాత్రలో పాల్గొన్న వాళ్లపై రాళ్లు రువ్వి, కార్లకు నిప్పులు అంటించారు. ఈ ఘటనలో ఇద్దరు హర్యానా హోంగార్డులు మృతి చెందగా, పలువురు పోలీసులతో సహా సుమారు 15 మంది గాయపడ్డారు. మృతులకి హర్యానా ప్రభుత్వం రూ.59 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.


ఇక ఈ హింస కాస్త ఢీల్లి చుట్టుపక్కల జిల్లాలు గురుగ్రామ్, సోహ్నా లకు వ్యాపించింది. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 15 కంపెనీల కేంద్ర బలగాలను హర్యానాకు పంపించింది. గురుగ్రామ్, సోహ్నా రోడ్డులోని బాద్షాపూర్, పటోడి చౌక్, నుహ్, ఫరీదాబాద్, పాల్వాల్ తదితర ప్రాంతాల్లో మళ్లీ హింస చోటు చేసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు హర్యానాలోనే హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 44 పైగా కేసులను నమోదు చేశారు. మరియు 70 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


Also Read : ఆమె కోసం బ్రా కొనడం చూసి, నా ఫ్రెండ్స్ భయపడిపోయారు: కరణ్ జోహార్






Join Us on Telegram: https://t.me/abpdesamofficial