Gopichand Priya Bhavani Shankar and Malavika Sharma's Bhimaa Movie Twitter Review: మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'భీమా'. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కన్నడ దర్శకుడు ఎ హర్ష తెరకెక్కించిన చిత్రమిది. 'పంతం' తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా. టీజర్, ట్రైలర్ కమర్షియల్, మాస్ అంశాలతో పాటు కంటెంట్ కూడా ఉండనే నమ్మకాన్ని కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉంది? సోషల్ మీడియాలో నెటిజనులు సినిమా గురించి ఏం అంటున్నారు? అనేది చూస్తే...


గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కినట్లే!
Bhimaa premiere show review, report: 'భీమా' హిట్టు బొమ్మ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మూవీలో ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ అదిరిపోయాయట. మరీ ముఖ్యంగా కమర్షియల్ హంగులతో పాటు సినిమాలో కంటెంట్ కూడా బావుందని చెబుతున్నారు. 'భీమా'తో గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కేశారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు హైలైట్ అవుతాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.


Also Read: గామి ఆడియన్స్ రివ్యూ... ప్రీమియర్ షో రిపోర్ట్ ఎలా ఉంది? కథ, ట్విస్టులపై నెటిజనులు ఏం అంటున్నారంటే?










'భీమా'... గోపీచంద్ మాస్ సంభవం!
గోపీచంద్ అభిమానులకు 'భీమా' డబుల్ ట్రీట్ అందిస్తుందని ప్రీమియర్ షోస్, ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 'భీమా'లో గోపీచంద్ డ్యూయల్ లుక్ ఆల్రెడీ ట్రైలర్లలో రివీల్ అయ్యింది. మూవీలోనూ డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో ఆయన ఇరగదీశారట. 






గోపీచంద్ ఇంతకు ముందు మూడుసార్లు పోలీస్ క్యారెక్టర్ చేశారు. అయితే... 'భీమా' సినిమాలో పోలీస్ రోల్ వాటికి భిన్నంగా, చాలా కొత్తగా ఉంటుందని నెటిజనులతో పాటు సినిమా చూసిన ప్రముఖులు చెబుతున్నారు. గోపీచంద్ మాస్ సంభవం ఈ సినిమాలో చూడొచ్చని అంటున్నారు.


Also Read: ఆ మీసకట్టు... కొత్త లుక్కు... 'భీమా'లో పోలీసుగా గోపీచంద్ స్టిల్స్ చూశారా?


గూస్ బంప్స్ తెప్పించే రవి బస్రూర్ మ్యూజిక్!
'కెజియఫ్', 'సలార్' సినిమాలతో రవి బస్రూర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమాకు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందట. హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మల క్యారెక్టర్లు కథలో భాగంగా వచ్చాయని, వాళ్లిద్దరూ అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో చక్కగా నటించారని చెబుతున్నారు. మాస్ జనాలకు సినిమా విపరీతంగా నచ్చే అవకాశం ఉందని టాక్. మీరూ సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి.


Also Read: ప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ