Vishwak Sen's Gaami movie twitter review in Telugu: విశ్వక్ సేన్ అఘోరా పాత్ర చేయడంతో 'గామి'పై ప్రేక్షకుల చూపు పడింది. యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి, టాలెంటెడ్ ఆర్టిస్ట్ అభినయ ఈ సినిమాలో నటించడం, ట్రైలర్ బావుండటంతో అంచనాలు పెరిగాయి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత ప్రచార చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేశారు. మరి, సినిమా ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ యూకే, అమెరికాలో ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. సినిమా చూసిన నెటిజనులు ఏం అంటున్నారు? ఈ ట్విట్టర్ రివ్యూలో తెలుసుకోండి. 


బ్యాక్ డ్రాప్, కాన్సెప్ట్ అదిరిపోయింది
ఎండింగ్, స్క్రీన్ ప్లే అయితే అదుర్స్!
Gaami Premiere show report and response: గామి స్టోరీ బ్యాక్ డ్రాప్, ఆ కాన్సెప్ట్ మీద నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్లైమాక్స్ అయితే కేక ఉందని చెబుతున్నారు. సినిమా చూసిన తర్వాత దర్శకుడు విద్యాధర్ కాగిత మీద చాలా గౌరవం గౌరవం పెరిగిందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇండియన్ సినిమాకు మెయిన్ ప్లాట్ (స్టోరీ), ట్విస్ట్ పూర్తిగా కొత్త అని, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని మరొకరు అభిప్రాయపడ్డారు. నిజాయతీగా తీసిన సినిమా అని ఇంకొకరు తెలిపారు. మాటలు రావడం లేదని, 'గామి'ని తప్పకుండా చూడాలని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.


Also Read: 'రానా నాయుడు 2' ఎక్స్‌ క్లూజివ్ అప్డేట్... విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే?














విజువల్ వండర్... నేషనల్ అవార్డు పక్కా!
'గామి' విజువల్ వండర్ అని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా మ్యూజిక్ చాలా బావుందని చెప్పారు. ఓ నెటిజన్ అయితే ఆ సంగీత దర్శకుడికి గుడి కట్టవచ్చని పేర్కొనడం గమనార్హం.


Also Read: మానవ స్పర్శ కోసం తపించే అఘోరాగా విశ్వక్ సేన్... కళ్లద్దాలతో చాందిని చౌదరి... 'గామి'లో లుక్స్, ఆ స్టిల్స్ చూశారా?














సెకండాఫ్ బావుంది! కానీ, ఫస్టాఫ్ స్లోగా ఉందా?
'గామి' ప్రీమియర్ షో రిపోర్ట్స్, రెస్పాన్స్ సూపర్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్... ఈ మూవీకి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ కూడా ఉంది. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయవద్దని ఒకరు సలహా ఇచ్చారు. సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్టులు సూపర్ అంటున్న ఒకరిద్దరు సైతం ఫస్టాఫ్ స్లోగా ఉందని చెబుతున్నారు. అసలు కథ చివరి 20 నిమిషాల్లో ఉంటుందని, అది ఇండియన్ సినిమాకు చాలా కొత్త అని, మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దానిపై మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుందని నెటిజనులు అభిప్రాయపడ్డారు. సో... మీరు సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి.


Also Read: సినిమాల్లోకి రావాల్సినోడు... నటుడిగా రాణించాలనుకున్నాడు... రాజకీయాల్లో ఇద్దరు సీఎంలను ఓడించాడు