Adipurush: ఓం రౌత్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ నటిస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఆదిపురుష్' ట్రెండింగ్ లో ఉంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లాంటి సినీ పరిశ్రమలు సైతం ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ప్రారంభం నుంచి వివాదాల్లో చిక్కుకుంటూ, పలు కాంట్రవర్సీలకు కారణమైన ఈ సినిమా సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఆదిపురుష్ ట్రైలర్ ను మే 9న సాయంత్రం 5.04 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు మూవీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో పాటు విల్లును ఎక్కుపెట్టిన ప్రభాస్ పోస్టర్ ను షేర్ చేసింది. అయితే, ముందుగా ప్రకటించినట్లు అన్ని థియేటర్లలో విడుదల చేయలేకపోతున్నామని, కొన్ని థియేటర్లలో 3డీ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని చిత్రయూనిట్ వెల్లడించింది.


ప్రభాస్, కృతి సనన్ రాముడు, సీత పాత్రల్లో నటించిన 'ఆదిపురుష్' ట్రైలర్ కు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఎప్పట్నుంచో వెయిట్ చేస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు మేకర్స్.. ఫైనల్ గా గుడ్ న్యూస్ చెప్పారు. మూవీ ట్రైలర్ ను మే 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ అనేక వివాదాలకు, విమర్శలకు దారి తీసింది. టీజర్ లోని సన్నివేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకునేలా లేవని చాలా మంది నెగెటివ్ రివ్యూను ఇచ్చారు. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ లో మార్పులు చేయిస్తామని మేకర్స్ వెల్లడించారు. ఇక ఇటీవలే వీఎఫ్ఎక్స్ ఛేంజ్ కు సంబంధించిన పనులు జరిగినట్టుగా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. రీసెంట్ గా సీత లుక్ ను కూడా విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకూ విమర్శలే ఎక్కువగా ఎదుర్కొన్న మూవీ టీం.. ఈ సారి మంచి టాక్ రావడంతో కాస్త ఆనందంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అదే ఉత్సాహంతో ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.


ఇటీవల ‘ఆదిపురుష్’ టీమ్ షేర్ చేసిన థియేటర్ల జాబితా. అయితే, వీటిలో ఏయే థియేటర్లలో 3డీ ట్రైలర్ రద్దు చేశారో తెలుసుకుని వెళ్లడం బెటర్.






రిలీజ్ సందర్బంగా ఇప్పటికే ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మొదలు పెట్టేసిన నిర్మాతలు సినిమా అఫిషియల్ ట్రైలర్ ను మే 9న విడుదల చేస్తామని ఇంతకుమునుపే ప్రకటించారు. ఇదిలా ఉండగా 'ఆదిపురుష్' మూవీని 2Dతో పాటు 3D ఫార్మాట్ లోనూ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ ని ఇవ్వడం ఖాయమని మేకర్స్ ఆశిస్తున్నారు, అయితే 'ఆదిపురుష్' ట్రైలర్ ను యూట్యూబ్ లోనే కాకుండా కొన్ని థియేటర్స్ లో నేరుగా రిలీజ్ చేయనున్నారు.


దాదాపు 70 దేశాల్లో ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఆ మేరకు థియేటర్ల జాబితాతో కూడిన వివరాలను రిలీజ్ చేశారు. కానీ దీనికి సంబంధించిన మరో వార్తను కూడా యూవీ క్రియేషన్స్ తాజాగా పంచుకుంది. త్రీడీ స్ర్కీన్ ల కొరత కారణంగా కొన్ని థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ ను క్యాన్సల్ చేశామని వెల్లడించింది. కానీ ఈ విషయంపై ఎవరూ ఆందోళన చెందవద్దని, వాటికి బదులుగా అదనంగా మరో 5 థియేటర్లలో 'ఆదిపురుష్' ట్రైలర్ కు ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది.






త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పాన్ ఇండియా రేంజ్ లో 'ఆదిపురుష్' జూన్ 16న రిలీజ్‌కి కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చిత్ర నిర్మాత‌లు సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్ప‌టికే ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్‌ డేట్ ను కూడా ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. జూన్ 3న తిరుప‌తిలో ఎస్‌.వి.గ్రౌండ్‌లో మేకర్స్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈవెంట్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కూడా వ‌స్తార‌ని కూడా అంటున్నారు. 


Also Read: సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య