GOAT Box Office Collection Day 1: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెస్టెంబర్ 5న భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైంది. విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్తోంది. ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ స్పై థ్రిల్లర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 55 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా, రూ. 43 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రాకింగ్ వెబ్ సైట్ సక్ నిల్క్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలిపింది. 


ఏ భాషలో ఎన్ని కోట్లు సాధించిందంటే?


‘గోట్‘ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6500 స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్లా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నది. తొలి రోజు ఈ సినిమా తమిళంలో రూ. 38.3 కోట్లు సాధించింది. తెలుగులో ఈ మూవీ రూ. 3 కోట్లు సాధించగా, హిందీలో రూ. 1.7 కోట్లు వసూళు చేసింది. కన్నడలో రూ. 3 కోట్లు, మలయాళంలో రూ. కోటి, ఇతర రాష్ట్రాల్లో రూ. కోటి రూపాయలు సాధించింది. థియేటర్లలో 76.23 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. తొలి రోజే రూ. 100 కోట్లు సాధించిన ఈ సినిమా మున్ముందు బాక్సాఫీస్ దగ్గర మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. విజయ్ గత చిత్రం ‘లియో‘ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 145 కోట్లకు పైగా సాధించింది. ఆ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేస్తుందని అందరూ భావించినా, క్రాస్ చేయలేకపోయింది.






రూ. 380 కోట్లతో తెరకెక్కిన ‘గోట్‘


‘గోట్‘ సినిమాలో విజయ్ డ్యుయెల్ రోల్ పోషించారు. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.   ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, జయరామ్, లైలా, అజ్మల్ అమీర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో క్రియేట్ చేసిన కెప్టెన్ విజయ్ కాంత్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై నిర్మాత అర్చన కల్పతి నిర్మించారు. సుమారు రూ. 380 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నటనకు గాను విజయ్ రూ. 200 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు అర్చన తెలిపారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ లో ‘ఇండియన్‌-2‘ మూవీని క్రాస్ చేసింది.   



Read Also: 'ది గోట్' రివ్యూ : తండ్రి పాలిట కన్న కొడుకే విలన్ అయితే... విజయ్ సినిమా హిట్టా ? ఫట్టా ?