ఇటు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అభిమానులు, అటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు... సగటు తెలుగు సినిమా అభిమానితో పాటు యావత్ భారతీయ ప్రేక్షకులు, గ్లోబల్ స్థాయిలో కొందరు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నది 'గ్లోబ్ ట్రాటర్' (Globetrotter Event) ఈవెంట్ కోసం. నవంబర్ 15వ తేదీన... అంటే ఈ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ (SSMB29 Event) జరగనున్న సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ మీద రాజమౌళి ఓ వీడియో విడుదల చేశారు.

Continues below advertisement


పాసులు లేనివారు రావొద్దని వినతి!
Globetrotter Event Passes: మహేష్ - రాజమౌళి సినిమా ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్ నేరుగా చూడాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. అయితే పాసులు లేని వారిని రావొద్దని రాజమౌళి రిక్వెస్ట్ చేశారు. పాసులు అమ్ముతున్నట్టు కొందరు చేసిన వీడియోలు తన దృష్టికి వచ్చాయని, అటువంటి పుకార్లను నమ్మవద్దని ఆయన తెలిపారు. శనివారం నాడు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుందని చెప్పిన ఆయన... ఈవెంట్ దగ్గరకు ఎలా రావాలనేది కూడా తెలిపారు.


జియో హాట్ స్టార్ ఓటీటీ వేదికలో 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ లైవ్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆ వేడుకను అందులో వీక్షించవచ్చని రాజమౌళి తెలిపారు.


Also Read: ఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?






పాటతో పాటు మెయిన్ రోల్స్ లుక్కులూ!
రోజుకు ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్, ఆయన క్యారెక్టర్ నేమ్ కుంభ అని మొదట అప్డేట్ ఇచ్చారు. తర్వాత శృతి హాసన్ పాడిన 'సంచారి' సాంగ్ విడుదల చేశారు. తర్వాత హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆవిడ మందాకినీ రోల్ చేస్తున్నారని తెలిపారు. మరి మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో? ఫ్యాన్స్ అయితే ఆయన లుక్కుతో పాటు టైటిల్ రివీల్ ఎప్పుడు చేస్తారోనని ఎదురు చూస్తున్నారు.


Also Readకెన్యా అడవుల్లో అనసూయ... మహేష్ - రాజమౌళి సినిమా షూట్ చేసిన ప్లేసుకు!?