కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) హైదరాబాద్ సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ (Kavya Maran)తో ప్రేమలో ఉన్నట్లుగా కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కోలీవుడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి రూమర్స్‌ను అనిరుధ్ టీమ్ కొట్టిపడేసింది. అనిరుధ్, కావ్య మారన్ మంచి స్నేహితులు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి వార్తలు అబద్ధమని తేల్చేశారు.
అయినా పుకార్లు మాత్రం ఆగలేదు అనిరుధ్, కావ్య మారన్ ఫారిన్‌లో సీక్రెట్‌గా షికార్లు చేస్తూ తాజాగా అభిమానులకు దొరికిపోయారు. దాంతో మరోసారి వీరి లవ్ స్టోరీ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అనిరుధ్, కావ్య మారన్ అమెరికాకు జంటగా ట్రిప్‌కు వెళ్లారని టాక్. న్యూయార్క్ వీధుల్లో షికార్లు చేస్తుండగా... ఓ అమెరికన్ యూట్యూబర్ తీసిన వీడియోలో అనుకోకుండా ఈ జంట చిక్కిందట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వాళ్లు వెళ్లింది అమెరికాలోని న్యూయార్క్ కాదని, యూకే అని టాక్.
వైరల్ వీడియోతో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరిద్దరికి నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. పెళ్లి కబురు వినిపించడం ఒక్కటే మిగిలిందని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం సీక్రెట్ లవర్స్ భలే దొరికేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనిరుధ్, కావ్య మారన్ ప్రేమాయణం గురించి ఇరువురి కుటుంబ సభ్యులకు తెలుసునని, పెద్దల అంగీకారంతోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి జరుగనుందని అంటున్నారు.
Also Read: కెన్యా అడవుల్లో అనసూయ... మహేష్ - రాజమౌళి సినిమా షూట్ చేసిన ప్లేసుకు!?
ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతోన్నాడు అనిరుధ్. ధనుష్ త్రీ సినిమాతో కెరీర్‌ను మొదలుపెట్టిన అనిరుధ్ తక్కువ టైమ్‌లోనే నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్నారు. దక్షిణాదిలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కావడం గమనార్హం. ఒక్కో సినిమాకు పదిహేను కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తమిళంలో దళపతి విజయ్ జననాయగన్, లోకేష్ కనగరాజ్ డీసీతో పాటు పలు భారీ బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులోనూ నాని ప్యారడైజ్, ఎన్టీఆర్ దేవర 2 సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.
మరోవైపు ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్‌కు సహ యజమానురాలిగా, ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో కావ్య మారన్‌కు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ ద్వారా ఫేమస్ అయ్యింది.
Also Read: రష్మిక చేతికి విజయ్ ముద్దు... పబ్లిక్‌లో ఫస్ట్ టైమ్... ప్రేమను ఇలా చెప్పాడా?