Ram Charan Speech on Sai Durgha Tej : సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'సంబరాల ఏటిగట్టు. తాజాగా ఈ సినిమా కార్నేజ్ టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సినిమాకు 'సంబరాల ఏటిగట్టు' అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా, ఈ కార్నేజ్ టీజర్ను రామ్ చరణ్ లాంఛ్ చేశారు. కార్నేజ్ వీడియోలో సాయి దుర్గా తేజ్ యాక్షన్ ఇంటెన్స్ రోల్​లో, కంప్లీట్ న్యూ లుక్​లో కన్పించాడు.  


ఆంజనేయస్వామి మీద ఒట్టేసి చెబుతున్న... 


ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ "వేదికపై ఉన్న నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, అలాగే మేము ఎంతగానో గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మా అభిమానులు... అందరికీ పేరుపేరునా నమస్కారం. ముందుగా ఒక ఫైటర్​లా 10 ఇయర్స్​ని పూర్తి చేసిన తేజ్ కి కంగ్రాచ్యులేషన్స్. ఇదొక అద్భుతమైన జర్నీ. తేజ్ కేవలం మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి అన్న విషయం అందరికీ తెలుసు. తేజ్ ఒక మంచి కొడుకు, మంచి మేనల్లుడు, ఒక మంచి అన్నయ్య, ఓ మంచి తమ్ముడు. తను చేసే ప్రతి క్యారెక్టర్ కోసం కష్టపడతాడు, తపన పడతాడు. అయితే తేజ్ ఈరోజు మీ అందరి సపోర్ట్ వల్లే ఇక్కడ ఉన్నాడు. ఆంజనేయస్వామి మీద ఒట్టేసి చెబుతున్నా... అది కేవలం మీ బ్లెస్సింగ్స్ మాత్రమే. ఇది తేజ్ కి పునర్జన్మ. నిజానికి ఆ మూడు నెలలు గుర్తు చేసుకోవాలని నాకు లేదు. కానీ అది మాకు చాలా కష్ట సమయం. అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత తేజు మళ్లీ ఇక్కడ నిలబడ్డాడు అంటే... తను మా తేజ్ కాదు మీ తేజ్. ఆ మూడు నెలలు మేము ఎంత భయపడ్డామంటే, కనీసం చెప్పడానికి మాటలు కూడా లేవు నా దగ్గర. ఈ జన్మను అభిమానులు ఇచ్చారు. తేజ్ తరఫున, మా విజయక్క తరపున మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు రామ్ చరణ్. 






తేజు ఊచకోత చూస్తారు...


ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ "సంబరాల ఏటిగట్టు తేజుకి 18వ సినిమా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడనున్నారు. అవుట్ స్టాండింగ్ విజువల్స్ తో సినిమా అద్భుతంగా ఉండబోతుంది. దర్శకుడు రోహిత్ ఫస్ట్ సినిమా చేస్తున్నట్టుగా లేదు, అద్భుతంగా ఉంది. ఆయనకు ప్రత్యేకంగా థాంక్స్. ఇక నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య గారికి తేజ్ మీద ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నందుకు ఆల్ ది బెస్ట్. ఇది సినిమా పట్ల వాళ్లకు ఉన్న ప్యాషన్ ఏంటో తెలియజేస్తుంది.



సినిమాలో పని చేస్తున్న నటీనటులు, టెక్నీషియన్స్ కి ఆల్ ది బెస్ట్. సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజానికి తేజూది బండ ప్రేమ. ఒక్కసారి పట్టుకుంటే గట్టిగా ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమను అబ్బాయిలకే ఎక్కువగా పంచుతున్నాడు. ఇప్పటికైనా అమ్మాయిలకు పంచు. ఈ మూవీతో తేజు పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి గుడ్ న్యూస్ అందించాలని కోరుకుంటున్నాను" అంటూ తన స్పీచ్ పూర్తి చేశారు రామ్ చరణ్. 


Also Read : జానీ మాస్టర్ బ్యాక్ టు యాక్షన్... అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో చూశారా?