కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైఫ్ కొన్ని రోజులుగా ఎలా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డ్ అందుకోవాల్సిన మాస్టర్.. జైలు ఊసలు లెక్కపెట్టాల్సి వచ్చింది. కష్టాన్ని నమ్ముకుని స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ.. చివరికి నేషనల్ అవార్డ్ రేంజ్‌కి వెళ్లిన జానీ మాస్టర్‌పై పరిస్థితులు పగబట్టేశాయి. టాలీవుడ్‌తో పాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషలలోని సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు పట్టేస్తూ.. తన సత్తా చాటుతున్న జానీ మాస్టర్‌ లైఫ్‌లో కొన్ని రోజుల పాటు చీకటి రోజులు అలుముకున్నాయి. ఆ చీకటి రోజులను దాటుకుని మళ్లీ జానీ మాస్టర్ వస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమైన నేపథ్యంలో ఆయనకు బెయిల్ లభించడం, జైలు నుండి బయటకు రావడం చకచకా జరిగిపోయాయి.


అసలు ఏం జరిగిందంటే..
తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్న యువతిపై జానీ మాస్టర్ ఆత్యాచారం చేశాడంటూ సదరు యువతి జానీ మాస్టర్‌‌పై కేసు పెట్టింది. దీంతో జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆయనని కొన్ని రోజుల పాటు పోలీసులు విచారించారు. ఈ విచారణ సమయంలో ఆయనపై రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో నేషనల్ అవార్డ్స్ వేడుక జరగడంతో.. ఆ అవార్డు అందుకునే సమయానికి.. ఆయనికి వచ్చిన అవార్డును వెనక్కి తీసుకుంటున్నట్లుగా జ్యూరీ ప్రకటించింది. దీంతో ఈ అవార్డు కోసం బెయిల్‌పై బయటికి వచ్చిన జానీ మాస్టర్ మళ్లీ జైలుకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. అయితే ఈ కేసులో వాస్తవాలు ఏంటనేది అటు పోలీసులు కానీ, ఇటు కోర్టులు కానీ ఏవీ తెలియపర్చలేదు.


Also Readఇయర్ ఎండ్ రివ్యూ 2024: కల్కి, సలార్ to పుష్ప 2, దేవర... పిక్చర్ అభీ బాకీ హై ఆడియన్స్ - అసలు కథ సీక్వెల్‌లో ఉందండోయ్!


ఇక రెగ్యులర్ బెయిల్‌తో జైలు నుండి బయటకు వచ్చిన జానీ మాస్టర్.. మళ్లీ సమాజంలో ఎలా తలెత్తుకుని నిలబడతాడో అనేలా ఆయన అభిమానుల్లో అనుమానం నెలకొని ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి జానీ మాస్టర్ తన వర్క్‌లో నిమగ్నమయ్యారు. మధ్యలో తనను డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తప్పించినా.. తనకు తెలియకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని సెలక్ట్ చేసుకున్నా.. జానీ మాస్టర్ మాత్రం కామ్‌గానే ఉన్నారు. త్వరలోనే అన్నీ బయటికి వస్తాయి అన్నారు తప్పితే.. ఎక్కడా అగ్రెసివ్‌గా మూవ్ అవలేదు. ఇవన్నీ అనవసరం.. మళ్లీ మన వర్క్‌తోనే మాట్లాడాలని నిర్ణయించుకున్న జానీ మాస్టర్.. ‘బ్యాక్ టు ద బీట్స్ ఇన్ ఫుల్ వ్యాల్యూమ్..’ అంటూ తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేశారు. 






పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ సాంగ్ మ్యూజిక్‌తో వచ్చిన ఈ వీడియోలో జానీ మాస్టర్ ఇంటి నుండి డ్యాన్స్ ప్రాక్టీస్ హౌస్‌కు వెళుతున్నట్లుగా ఎలివేషన్స్‌తో ఈ వీడియోను కట్ చేశారు. అంతేకాదు, బిగ్ అప్డేట్స్ లోడింగ్ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ చూసిన వారంతా.. ఇది కచ్చితంగా ‘గేమ్ చేంజర్’కు సంబంధించినదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఆయనకు స్వాగతం పలుకుతూ కామెంట్స్ చేశారు. మొత్తంగా అయితే ఈ వీడియో వైరల్ అవుతోంది.


Also Readఅల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!