Gautham Vasudev Menon Role In Euphoria Movie: డైరెక్టర్ గుణశేఖర్, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక ప్రధాన పాత్రలో వస్తోన్న లేటెస్ట్ యూత్ ఫుల్ సోషల్ డ్రామా 'యుఫోరియా'. ఈ మూవీ షూటింగ్ పూర్తైందని తెలుపుతూ ఓ మేకింగ్ వీడియోను చాలా రోజుల క్రితం విడుదల చేసింది మూవీ టీం. ఆ తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. తాజాగా మరో కీలక రోల్ గురించి అప్‌డేట్ ఇచ్చారు.
కీలక రోల్‌లో గౌతమ్ మీనన్
ఈ మూవీలో ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీలక రోల్‌లో రూమర్స్ అప్పట్లో వినిపించాయి. తాజాగా.. దీనిపై టీం అధికారికంగా ఆయన రోల్ రివీల్ చేస్తూ ప్రకటన చేసింది. మూవీలో గౌతమ్.. జయదేవ్ నాయర్‌గా కనిపించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటివరకూ గౌతమ్ రోల్‌పై ఎలాంటి లీక్స్ కాకుండా మూవీ టీం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. దీనిపై హైప్ క్రియేట్ కాగా.. తాజాగా సస్పెన్స్‌కు తెరదించింది.
Also Read: నువ్వెవరో నీకే తెలియని యోధావి - అప్పుడు 'హనుమాన్'.. ఇప్పుడు రాముడు.. 'మిరాయ్' టీజర్ వేరే లెవల్..
గుణశేఖర్ హోమ్ బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై.. నీలిమ గుణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఎవ్వరూ టచ్ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్, లుక్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో భూమికతో పాటు సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. విఘ్నేష్ రెడ్డి ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
2 దశాబ్దాల తర్వాత..
దాదాపు 2 దశాబ్దాల తర్వాత హిట్ కాంబో రిపీట్ అవుతోంది. గుణశేఖర్ డైరెక్టర్‌గా మహేష్ బాబు 'ఒక్కడు' మూవీలో హీరోయిన్‌గా నటించారు భూమిక. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి హిట్ కొట్టడం ఖాయమంటూ మూవీ లవర్స్ అంటున్నారు. చాలాకాలంగా గుణశేఖర్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. 'రుద్రమదేవి' పర్వాలేదనిపించినా.. లాస్ట్ మూవీ సమంత 'శాకుంతలం' అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అటు.. భూమిక కూడా రీఎంట్రీ తర్వాత చివరగా అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి 'బటర్ ఫ్లై' మూవీలో కనిపించారు. ఈ మూవీతో సరైన హిట్ కొట్టాలని భావిస్తున్నారు.