Taara Taara Song Released From Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు' నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన మాట వినాలి, కొల్లగొట్టినాదిరో, అసుర హననం సాంగ్స్ ట్రెండ్ సృష్టించగా.. నిధి అగర్వాల్ సాంగ్ సైతం ఆకట్టుకుంటోంది.
'తారా తార నా కళ్లు'
పోతుంటే నువ్వలా అలా.. బజార్ మొత్తం గోలే గోల.. కోపంగా నువ్వు చూడొద్దలా.. పేలబోయే ఫిరంగిలా..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సాంగ్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్ తన అందం, డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ రోల్ ఎలివేషన్ ఇచ్చేలా సాంగ్స్ రాగా.. ఇప్పుడు హీరోయిన్ నిధి అగర్వాల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. 'తార తార నా కళ్లు.. వెన్నెల పూత నా ఒళ్లు' అంటూ నిధి అందాన్ని ఎలివేషన్ ఇచ్చేలా సాంగ్ హైప్ క్రియేట్ చేసింది. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా.. లిప్సిక, ఆదిత్య ఆలపించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉంది.
Also Read: నువ్వెవరో నీకే తెలియని యోధావి - అప్పుడు 'హనుమాన్'.. ఇప్పుడు రాముడు.. 'మిరాయ్' టీజర్ వేరే లెవల్..
ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించనుండగా.. ఫస్ట్ పార్ట్ 'హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో రిలీజ్ చేయనున్నారు. పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించగా.. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌రావు మూవీని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు.
ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ కనిపించని డిఫరెంట్, పవర్ ఫుల్ రోల్‌లో పవన్ కనిపించనున్నారు. ఆయన రోల్ ఎలివేషన్ ఇచ్చేలా ఇటీవల రిలీజ్ అయిన 'అసుర హననం' సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. 'సమర శంఖారావమల్లే ఘీంకరించు ఆగ్రహం.. వైరమైన, శౌర్యమైన మ్రోగు మరణ మృదంగం..' అంటూ సాగే లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. విలన్, హీరో మధ్య భారీ యుద్ధ సన్నివేశాల బ్యాక్ డ్రాప్‌లో పాట ఉంటుందని తెలుస్తోంది. సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. మిగిలిన భాగాన్ని ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. రెండో భాగానికి కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ట్రైలర్‌ను సైతం రిలీజ్ చేయనున్నారు.