మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహించిన యాక్షన్ ఫిల్మ్ 'గాంఢీవధారి అర్జున' (Gandeevadhari Arjuna Movie). ఈ నెల 25న... అంటే ఈ శుక్రవారమే సినిమా విడుదల అవుతోంది. అసలు, ఈ సినిమా బడ్జెట్ ఎంత? దర్శక, నిర్మాతలు ముందుగా అనుకున్న సమయంలో తీశారా? లేదా? అంటే... 


55 కోట్లు కాదు... రూ. 40 కోట్లే!
Gandeevadhari Arjuna Budget : 'గాంఢీవధారి అర్జున' సినిమా బడ్జెట్ రూ. 55 కోట్లు దాటిందని, ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కావడంతో నిర్మాతలు కాస్త ఇబ్బంది పడుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, అసలు నిజం ఏమిటి? అంటే... 


'గాంఢీవధారి అర్జున్' సినిమా చిత్రీకరణకు 72 రోజులు అవసరం అవుతాయని ముందుగా ప్లాన్ చేశారు. ఆ ప్రకారం షెడ్యూల్స్ వేశారు. అయితే, దర్శకుడు ప్రవీణ్ సత్తారు & హీరో వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల 53 రోజుల్లో సినిమా అంతా పూర్తి చేశారు. సినిమా నిర్మాణ వ్యయం కూడా 40 కోట్ల రూపాయలే. 


'గాంఢీవధారి అర్జున్' చిత్రీకరణకు రోజుకు కోటి రూపాయల కంటే తక్కువ ఖర్చు అయ్యింది. సాధారణంగా యాక్షన్ సినిమాలు తీసేటప్పుడు ఖర్చు పెరగడం, కాస్త ఎక్కువ అవ్వడం కామన్. అందులోనూ విదేశాల్లో చిత్రీకరణ అంటే ప్రతి రూపాయి లెక్క వేయక తప్పదు. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో తీయవచ్చని వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు, నిర్మాతలు చూపించారు. అదీ సంగతి!


Also Read : ప్రతి పండక్కి... ప్రతి నెలలో శ్రీ లీల సినిమా - వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు!



సెన్సార్ పూర్తి... రన్ టైమ్ ఎంతంటే?
Gaandeevadhari Arjuna censor : 'గాంఢీవధారి అర్జున' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. పెద్దలతో పాటు పిల్లలు కూడా సినిమాకు వెళ్ళవచ్చు. ఇక, రన్ టైమ్ విషయానికి వస్తే... 2.18 గంటలు. స్టైలిష్ అండ్ స్లీక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారని తెలిసింది.      


ఈ శుక్రవారమే థియేటర్లలో సినిమా
'గాంఢీవధారి అర్జున'ను ఆగస్టు 25న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాను భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష'తో ఎస్వీసీసీ భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'అశ్విన్స్' విడుదల చేసింది.   


Also Read : అనసూయ విడాకులు తీసుకుంటున్నారా? ఏందీ కొత్త గోల?


వరుణ్ తేజ్ జోడీగా 'ఏజెంట్' ఫేమ్, యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, 'బేబీ' వేద ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు : అవినాష్ కొల్ల, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, యాక్షన్ కొరియోగ్రఫీ : లాజ్లో - వెంకట్ - విజయ్ - జుజి, ఛాయాగ్రహణం : ముఖేష్ జి. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial