జీవితంలో ఏమీ సాధించలేని వ్యక్తిగా, లూజ‌ర్ కింద మిగిలిపోతున్న ఓ యువకుడికి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తాడు. అలాంటి తరుణంలో అతని జీవితం ఆసక్తికరమైన ఆట మొదలు అవుతుంది. ఆ ఆట అతడిని ఏ తీరాలకు తీసుకు వెళ్ళింది? ఆట మధ్యలో అతను ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నాడు? అనే కథతో రూపొందిన చిత్రం 'గేమ్ ఆన్'. ఈ సినిమాలో గీతానంద్ హీరో. నేహా సోలంకి (Neha Solanki) హీరోయిన్. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


సమ్మర్ సందడికి 'గేమ్ ఆన్'!   
Game On Movie Release Update : 'గేమ్ ఆన్' చిత్రాన్ని (Game On Movie) క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ పతాకాలపై రవి కస్తూరి (Ravi Kasturi) నిర్మించారు. ఈ చిత్రానికి ద‌యానంద్ దర్శకుడు. ఇంటెన్స్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా సినిమాను రూపొందించామని దర్శక నిర్మాతలు తెలిపారు.


'గేమ్ ఆన్'లో యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్, కామెడీ... అన్నీ ఉన్నాయని, అయితే ఇది కోర్ డ్రామా సినిమా అని నిర్మాత రవి కస్తూరి తెలిపారు. 'రథం' తర్వాత హీరోగా గీతానంద్ (Geethanand)కు ఇదొక గొప్ప సినిమా అవుతుందని ఆయన చెప్పారు. ఆల్రెడీ విడుదల చేసిన పాటలు, విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. 'దసరా' విడుదలైన థియేటర్లలో 'గేమ్ ఆన్' టీజర్ ప్రదర్శించగా... ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చిందన్నారు.


కీలక పాత్రల్లో మధుబాల అండ్...
గేమ్ ఆన్' సినిమాలో సీనియర్ హీరోయిన్, 'రోజా' ఫేమ్ మధుబాల, ఆదిత్య మీనన్, 'బిగ్ బాస్' వాసంతి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతానికి వాళ్ళ క్యారెక్టర్లు ఏమిటి? అనేది సస్పెన్స్.  


Also Read 'కెజియఫ్' దర్శకుడి కథకు దీపికా పదుకోన్ ఓకే అంటుందా?


'పడిపోతున్నా... నిన్ను చూస్తూనే!  పడిపోతున్నా... ప్రేమలోనే!' అంటూ సాగే గీతాన్ని హారికా నారాయణ్, స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటకు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. అశ్విన్, అర్జున్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రెండో పాట ఇది. 'గేమ్ ఆన్'లో మొదట పాట 'రిచో రిచ్'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆల్మోస్ట్ 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ పాటకు లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చిత్ర బృందం తెలిపింది. ''రొటీన్ సినిమాలకు భిన్నమైన కథతో తీసిన చిత్రమిది. ఈ సినిమాలో చాలా ట్విస్టులు, ట‌ర్నులు ఉన్నాయి. యాక్ష‌న్‌, రొమాన్స్, ఎమోష‌న్స్... అన్ని అంశాలు ఉన్నాయి. మా కథ నచ్చి సినిమా చేయడానికి వచ్చిన నిర్మాతకు థాంక్స్'' అని  దర్శకుడు ద‌యానంద్ అన్నారు.


Also Read మళ్ళీ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ - 'ఉస్తాద్' సెట్స్ నుంచి లీకైన లుక్ చూశారా?


ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, 'బిగ్ బాస్' వాసంతి కృష్ణన్, కిరిటీ, 'శుభ‌లేక' సుధాక‌ర్‌ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు : క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్‌, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎడిట‌ర్ : వంశీ అట్లూరి, స్టంట్స్‌:  రామ‌కృష్ణ‌న్‌, న‌భా స్టంట్స్‌, సంగీతం : న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌, నేపథ్య సంగీతం : అభిషేక్ ఎ.ఆర్‌ మాటలు :  విజ‌య్ కుమార్ సిహెచ్‌, ఛాయాగ్రహణం :  అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌, నిర్మాత‌ : ర‌వి క‌స్తూరి, ద‌ర్శ‌క‌త్వం : ద‌యానంద్‌.