Ram Charan's Game Changer Trailer గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్‌'. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తుందీ సినిమా. అయితే... ట్రైలర్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. మెగా అభిమానులతో పాటు శంకర్ సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకుల సైతం ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.


గురువారం సాయంత్రం 05.04 గంటలకు!
జనవరి 2వ తేదీ... గురువారం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు 'గేమ్ చేంజర్‌' ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలియజేసింది. సో... మెగా అభిమానులకు జనవరి ఒకటో తేదీతో పాటు రెండున కూడా సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పవచ్చు. 


సెన్సార్ రిపోర్ట్ బావుంది... సినిమా బ్లాక్ బస్టర్!
'గేమ్ చేంజర్‌' సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అంతే కాదు...‌ సినిమా బాగుందని అప్రిసియేషన్ కూడా ఇచ్చిందట.‌ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్ట్స్ రావడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.


Also Read: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!






'గేమ్ చేంజర్‌' సినిమాలో రామ్ చరణ్ జంటగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించారు.‌ తెలుగులో ఆమెకు మూడో చిత్రమిది. దీనికి ముందు చరణ్ 'వినయ విధేయ రామ'లో, సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాల్లో నటించారు.‌ ఈ సినిమాలో అంజలి మరొక కథానాయిక. అయితే ఆవిడ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలకు మాత్రమే పరిమితం. ఇందులో రామ్ చరణ్ డబుల్ రోల్ చేశారు.‌ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో వచ్చే అప్పన్న పాత్రకు జంటగా అంజలి కనిపించనున్నారు. 


Also Read'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?



తెలుగులో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, దర్శకుడి నుంచి నటుడుగా మారిన ఎస్.జె. సూర్య, మలయాళ స్టార్ హీరో జయరామ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థలపై తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు.