Game Changer Songs: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఈ మధ్య రిలీజ్ డేట్ గురించి నిర్మాత 'దిల్' రాజు ఓ అప్డేట్ ఇచ్చారు. క్రిస్మస్ బరిలో 'గేమ్ ఛేంజర్' (Game Changer Release Date) విడుదల కానుందని చెప్పారు. ఇప్పుడు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ (Music Director Thaman) మరొక అప్డేట్ ఇచ్చారు. సెకండ్ సాంగ్ రిలీజ్ గురించి చెప్పారు.


ఆగస్టు నెలాఖరులో 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్!?
''మొన్న 'దిల్' రాజు గారు మంచి బ్లాస్ట్ ఇచ్చారు. ఆగస్టు నెలాఖరు నుంచి మేం అప్డేట్స్ ఇస్తాం. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. శంకర్ గారు ఫిక్స్ చేయాలి. మొన్న ఒక పాట లీక్ అయ్యింది. 'జరగండి' అని! ఇప్పుడు లీక్ కాక ముందు ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాం'' అని ఓ విలేకరుల సమావేశంలో సంగీత దర్శకుడు తమన్ చెప్పారు.


'గేమ్ ఛేంజర్' సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి?
How Many Songs In Game Changer Movie: శంకర్ సినిమాల్లో సాంగ్స్ అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా చూసినా సరే... పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. 'గేమ్ ఛేంజర్' సాంగ్స్ కోసం స్పెషల్ సెట్స్ వేయించారు. అసలు, ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయ్? అనే ప్రశ్నకు సైతం తమన్ సమాధానం ఇచ్చారు.


''సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. 'గేమ్ ఛేంజర్' రెండో పాటగా ఏది వస్తుంది? అనేది ఇంకా క్లారిటీ లేదు'' అని తమన్ చెప్పారు. అంటే... శంకర్ గారు ఏ సాంగ్ సెలెక్ట్ చేసి బయటకు వదులుతారో చూడాలి. అదీ సంగతి!


Also Read: హను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రోల్ అదేనా - ఎన్టీఆర్, బన్నీ తర్వాత ఆ లిస్టులోకి రెబల్ స్టార్!?






'భారతీయుడు 2' రిమార్క్ 'గేమ్ ఛేంజర్'తో పోవాలి!
శంకర్ దర్శకత్వం వహించిన 'భారతీయుడు 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ముఖంగా దర్శకత్వం మీద విమర్శలు వచ్చాయి. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'తో ఆ రిమార్క్స్ అన్నిటికీ శంకర్ చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే... 'భారతీయుడు 3' విడుదలకు ఇంకా సమయం ఉంది. అది 2025లో విడుదల కానుంది. దానికి ముందు 'గేమ్ ఛేంజర్' వస్తుండటంతో అందరి చూపు దీని మీద ఉంటుంది.


Also Readమెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే, అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేయాలి - హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్


రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ ఓ కథానాయికగా నటించిన 'గేమ్ ఛేంజర్'లో అంజలి మరో కథానాయిక. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించనుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలకమైన క్యారెక్టర్లు చేశారు.