గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' ఈ సినిమా ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇలా భారీ హైప్ తో థియేటర్లలోకి వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమాలో విజువల్ వండర్ గా ఉండబోతుందని ముందుగానే మేకర్స్ 'నానా హైరానా' పాట గురించి చెప్పి ఊరించారు. దీంతో సినిమాలో ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఆ పాట కనిపించకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు. కానీ తాజాగా ఆ పాట ఎందుకు థియేటర్లలో కనిపించలేదు? ఎప్పుడు ఆ పాటను యాడ్ చేయబోతున్నారు? అంటే...


'నానా హైరానా' సాంగ్ మిస్ 
'గేమ్ ఛేంజర్' మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన సాంగ్ 'నానా హైరానా'. రామ్ చరణ్ - కియారా అద్వానీ మధ్య నడిచే ఈ రొమాంటిక్ సాంగ్ అద్భుతంగా ఉండబోతుందని శంకర్ ముందుగానే చెప్పేశారు. తెరపై చూస్తున్నంత సేపు వేరే లోకంలో ఉన్నామా? అన్న లెవెల్ లో ఈ పాటను డిజైన్ చేశామని ప్రమోషన్స్ లో వెల్లడించారు. కానీ తాజాగా ఈ పాట థియేటర్లలో కనిపించలేదు. దానికి కారణం మూవీకి ఎదురైన సాంకేతిక సమస్యలే అని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాటను జనవరి 14 నుంచి థియేట్రికల్ వర్షన్ కి యాడ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఇప్పటికే పని చేస్తున్నట్టు సమాచారం. 


స్పెషల్ టెక్నాలజీతో 'నానా హైరానా' సాంగ్ 
ఇదిలా ఉండగా 'నానా హైరానా' సాంగ్ మంచి రొమాంటిక్ మెలోడీ. రిలీజ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'నానా హైరానా' పాటను కార్తీక్ - శ్రేయ ఘోషల్ పాడారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తమిళంలో వివేక్, హిందీలో కౌసర్ మునీర్ ఈ పాటకు సాహిత్యం రాశారు. అయితే సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్లలో భాగంగా తమన్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం శంకర్ ఓ ప్రత్యేకమైన టెక్నాలజీని వాడారని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. అది ఈ పాట కోసమేనని తెలుస్తోంది. 


Also Read: 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే? 


ఇన్ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించిన మొట్టమొదటి భారతీయ సాంగ్ ఇదే. ఇక ఈ పాటను తెరపై చూస్తున్నప్పుడు ఏదో కలల ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుందట. 'నానా హైరానా' సాంగ్ యూట్యూబ్ లో అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి రికార్డును క్రియేట్ చేసింది. శంకర్ సినిమాలలో పాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయనను అందరూ విజనరీ డైరెక్టర్ అంటూ ఉంటారు. అలాగే 'నానా హైరానా' పాటని చరణ్ - కియారా మధ్య అద్భుతమైన విజువల్స్ తో ఐదు రోజులపాటు న్యూజిలాండ్ లోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. అంతేకాదు ఈ పాటను షూట్ చేయడానికి రష్యా నుంచి దాదాపు 100 మంది స్పెషల్ డాన్సర్లను న్యూజిలాండ్ కు పిలిపించారట. ఇక ఈ పాటను తెరపై చూడాలంటే జనవరి 14 వరకు ప్రేక్షకులు వెయిట్ చేయాల్సిందే.


Also Read: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?