Baby 2 Funny Spoof at Suma Adda Show: ఆనంద్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ మూవీ 'గం గం గణేశా'. శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మే 31న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ బాగా ఆకట్టుకుంటుందని, ఫస్ట్‌ నుంచి చివరికి ఎలాంటి లాగ్ లేకుండ ఎంజాయ్‌ చేశామంటూ ఆడియన్స్‌ రివ్యూ ఇస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌ రన్‌ అవుతుంది ఈ సినిమా. ఇదిలా ఉంటే 'గం గం గణేశా' టీం తాజాగ యాంకర్ సమ అడ్డాలో సందడి చేసింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ హీరో ఆనందర్‌ దేవరకొండ, హీరోయిన్‌ నయన్‌ సారిక, జబర్దస్త్‌ కమెడియన్‌ ఇమ్మానుయేల్‌‌‌, బిగ్‌బాస్‌ యావర్‌ పాల్గొన్నారు.


బేబీ 2 స్పూఫ్


ఈ సందర్భంగా సుమతో కలిసి వీరు చేసిన రచ్చ రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇమ్మన్యుయేల్‌ కామెడీ, పంచ్‌ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. షో స్క్రిప్ట్‌లో భాగంగా 'బేబీ 2' స్పూఫ్‌ చేసి హిలెరియస్‌గా నవ్వించాడు. తన పేరు వైష్ణవి అని, తాను స్కూల్లో ఆనందన్‌, కాలేజ్‌ విరాజ్‌ని లవ్ చేశానని చెబుతుంది. కానీ చివరికి వేరేవాడిని పెళ్లి చేసుకున్నానంటూ వైష్ణవి పాత్రలో ఉన్న ఇమ్మానుయేల్‌‌‌ అంటాడు. ఇంతమందిని ఎలా ప్రేమించావమ్మా అని అడగ్గా.. మనసుతో అంటూ సమకు పంచ్‌ ఇస్తాడు ఇమ్మానుయేల్‌‌. ఆ సరే ఇప్పుడు నీ సమస్య ఏంటీ? అని సుమ అనగానే.. వీడిని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు వాళ్లిద్దరు కూడా కావాలనిపిస్తుందటూ తనదైన కామెడీతో నవ్వించాడు. 


అలాగే మరో వీడియోలో క్వశ్చనింగ్‌లో సుమ ఆనందర్‌  దేవరకొండ, హీరోయిన్‌ నయన్‌ సారికలను ప్రశ్నలు అడుగుతుంది. అందులో భాగంగా నైట్‌ లైఫ్‌(night life) అనగానే గుర్తొచ్చేవి ఏంటీ అని అడగ్గా.. పబ్‌, స్ట్రట్‌ ఫుడ్స్‌ అంటూ సమధానాలు చెప్పారు. ఆ తర్వాత వారు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దామని సుమ చూపించగానే... ఇమ్మానుయేల్‌‌ అబ్బా అసలైంది లేదు అంటాడు. అదేంటనగానే కేపీహెచ్‌బీ(KPHB) అంటాడు. దీంతో ఆడియన్స్‌ అంతా ఒక్కసారిగా నవ్వడం.. మీకు తెలియదదా.. కుర్రాళ్లంతా అక్కడే మెట్రోల కింఇమ్మానుయేల్‌‌ది తిరుగుతుంటారు అంటాడు. ఎందుకు అని అడగ్గా.. ఏమో వీడికే తెలుసు అంటూ యావర్‌ చూపించి ఇరికిస్తాడు. 


ఇమ్మానుయేల్‌‌ కి కౌంటర్


సుమ 'గం గం గణేశా' టీంతో నాగార్జున 'కింగ్'‌ సినిమాలోని వీల్‌ చైర్‌తో సీన్‌ని రిక్రియేట్‌ చేసింది. ఇందులో ఆనంద్‌ దేవరకొండ వీల్‌ చైర్‌పై పడి ఉంటాడు. దీంతో సుమ ఇతడికి కాళ్లు చేతులు పనిచేయడం లేదు. వెంటనే అతడి కాళ్లు చేతులు కదిలేలా చేయాలి.. ఏదైనా జోక్‌ చెప్పు అనగానే ఇమ్మన్యుయేల్‌ తనదైన స్టైల్లో పంచ్‌లు వేశాడు. అమ్మో బాబోయ్‌ నేను జోక్‌ వేస్తే ఉన్నది కూడా పోతుందని ఇమ్మానుయేల్‌‌‌ అనగానే సమ ఆకు తెలుసు అది అంటూ రికౌంటర్‌ ఇస్తుంది. ఆ తర్వాత చైర్‌లో ఉన్న ఆనంద్‌తో నీకు కళ్లు ఒక్కటే పనిచేస్తాయా? మాట్లాడగలవా? అంటూ స్క్రిప్ట్‌లో లీనమైన ఇమ్మానుయేల్‌‌కు ఆనందర్‌ దేవరకొండ 'నాకు వినిపిస్తుంది రా' అంటూ పంచ్‌ వేస్తాడు. ఇలా సుమ అడ్డాలో 'గం గం గణేశా' టీం పంచ్‌ డైలాగ్స్‌, కామెడీతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించింది. ఇక పూర్తి ఎపిసోడ్ చూడాలంటే నేడు రాత్రి ఈటీవీలో ఈ ఫుల్‌ ఎపిసోడ్ చూసేయండి. 


Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్‌ డైరెక్టర్‌ వివి వినాయక్ - ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన..