Director V.V Vinayak Shocking Look: ఈ ఫోటోలో ఉన్నటి ఓ స్టార్‌ డైరెక్టర్‌. ఒకప్పుడు ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చారు. యాక్షన్‌, ఫ్యాక్షన్‌ చిత్రాలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి ఇప్పటి గ్లోబల్‌ స్టార్స్‌‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల వరకు ఎంతోమంది స్టార్‌ హీరోలను డైరెక్ట్‌ చేశారు. ఆయనతో సినిమా అంటే హిట్‌ పక్కా హీరోలు, ఫ్యాన్స్‌ అంత ధీమాగా ఉండేవారు. అలాంటి డైరెక్టర్‌ ఇప్పుడు గుర్తుపట్టేలేని విధంగా మారిపోయారు. ఇంతకి ఈయన ఎవరో గుర్తొచ్చిందా. ఆయనే వివి వినాయక్‌.


సడెన్ గా తెరపైకి


కొంతకాలంగా సినిమాలకు, వెండితెరకు దూరంగా ఉన్న ఆయన సడెన్‌గా తెరపైకి వచ్చారు. దివంగత నటులు, సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఇందులో ఆయనను చూసి ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. కొంతమంది అయితే ఎవరో కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతుంటే గొంతు చాలా నీరసంగా అనిపిస్తుంది. ఆయనలో మునుపటి చార్మ్‌ కనిపించడం లేదు. అప్పటిలా బూర బుగ్గలు కూడా కనిపించడం, చాలా వీక్‌గా కనిపిస్తున్నారంటూ ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఇలా తెరపైకి రావడంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


ఎందుకంటే కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యంపై రకరకాలు పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఇన్‌సైడ్‌ సినీసర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలను ఆయన సోదరుడు కొట్టాపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేరుగా వివి వినాయక్‌ స్పందించారు. డైరెక్ట్‌గా తన ఆరోగ్యంపై స్పందించలేదు కానీ, సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి నేపథ్యంలో బయటకు వచ్చారు. ఎప్పుడు లేనిది కొత్తగా ఆయన వీడియో రిలీజ్‌ చేయడం చూస్తుంటే తన ఆరోగ్యంపై ఇన్‌డైరెక్టర్‌గా క్లారిటీ ఇచ్చారంటున్నారు. కానీ ఈ వీడియోలో ఆయన చాలా నీరసంగా కనిపించారు. ఎక్కువ సేపు మాట్లాడలేకపోయారు. రెండు, మూడు వ్యాఖ్యాలతో ముగించారు. బాగా చిక్కినట్టు కనిపించారు. పైగా కళ్లజోడు ధరించి ఉండటంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. 






తొలి సినిమాతోనే పెద్ద హిట్


ఇండస్ట్రీలో వివి వినాయక్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ ఆది సినిమాతో ఆయన డైరెక్టర్‌గా మారారు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌. తొలి చిత్రంతోనే భారీ విజయం అందుకున్న ఆయన ఆ తర్వాత ఇండస్ట్రీకి ఎన్నో సూపర్‌ హిట్‌లు ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవితో ఠాగూర్‌, మళ్లీ ఎన్టీఆర్‌తో అదుర్స్‌ ఇలా సూపర్‌హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించారు. మెగాస్టార్‌కు రీఎంట్రీలో ఖైదీ నెం.150 సినిమాతో మంచి కంబ్యాక్‌ ఇచ్చారు. అలాంటి ఆయన ఇప్పుడిలా గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో అంతా షాక్‌ అవుతున్నారు.


ఇక చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఛత్రపతి సినిమాను హిందీలో రిమేక్‌ చేశారు. కానీ ఈ మూవీ నిరాశ పరిచింది. నిన్న సూపర్‌ స్టార్‌ కృష్ణ సందర్బంగా ఆయన వీడియో రిలీజ్‌ చేస్తూ.. కృష్ణతో ఉన్న అనుబంధాన్ని, ఆయన సినిమాలకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ లో చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారితో తాను అసిస్టెంట్, కో - డైరెక్టర్‌గా నాలుగు సినిమాలకు పని చేశానని చెప్పారు. ఆయనతో వర్క్‌ చేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా, సంతోషంగా ఉంటుందని, కృష్ణ గారు ఎప్పడు మనతోనే ఉంటారంటూ చెప్పుకొచ్చారు.