మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాంఢీవధారి అర్జున' (Gandeevadhari Arjuna Movie). స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. రన్ టైమ్ కూడా లాక్ చేశారు. 


'గాంఢీవధారి అర్జున'కు యు/ఎ
Gaandeevadhari Arjuna censor formalities completed : 'గాంఢీవధారి అర్జున' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే... పెద్దలతో పాటు పిల్లలు కూడా సినిమాకు వెళ్ళవచ్చు. 


Gaandeevadhari Arjuna Run Time : 'గాంఢీవధారి అర్జున' రన్ టైమ్ కూడా లాక్ చేశారు. ఈ సినిమా నిడివి తక్కువే. రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు. చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు దీనిని ఒక స్టైలిష్ అండ్ స్లీక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారని తెలిసింది.      


ఆగస్టు 25న సినిమా విడుదల 
Gandeevadhari Arjuna Release Date : 'గాంఢీవధారి అర్జున'ను ఆగస్టు 25న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాను భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష'తో ఎస్వీసీసీ భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'అశ్విన్స్' విడుదల చేసింది.   


ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా 'ఏజెంట్' ఫేమ్, యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Vaidya) నటించారు. ఇంకా ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటకు మంచి స్పందన లభించింది.


Also Read : కాళహస్తిలో 'కన్నప్ప'ను ప్రారంభించిన విష్ణు మంచు - హీరోయిన్, దర్శకుడు ఎవరంటే?



'గాంఢీవధారి అర్జున' టీజర్, ట్రైలర్లు విడుదల చేశారు. అవి చూస్తే... దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించి పెద్ద స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఆ ఎమర్జెన్సీ నుంచి కాపాడే వ్యక్తి ఎవ‌రా? అని అంద‌రూ ఆలోచిస్తుంటే... అంత హై రిస్క్ నుంచి కాపాడే ఏకైక వ్య‌క్తిగా అర్జున్ (వరుణ్ తేజ్) క‌నిపిస్తాడు. ఇంత‌కీ, ఆ ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితులు ఏంటి? అర్జున్ ఎవ‌రు?  త‌నేం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే... ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాను చూడాలి. సినిమా విడుదలైన కొన్ని రోజులకు వరుణ్ తేజ్ ఇటలీ వెళ్లనున్నారు. లావణ్యా త్రిపాఠితో ఆయన వివాహం అక్కడే జరగనుంది. 


Also Read 'ప్రేమ్ కుమార్' రివ్యూ : పీటల మీద పెళ్లి ఆగితే? ఈసారైనా సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?


వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న 'గాంఢీవధారి అర్జున' సినిమాలో నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, 'బేబీ' వేద ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు : అవినాష్ కొల్ల, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, యాక్షన్ కొరియోగ్రఫీ : లాజ్లో - వెంకట్ - విజయ్ - జుజి, ఛాయాగ్రహణం : ముఖేష్ జి, సంగీతం : మిక్కీ జె మేయర్.