Filmfare OTT Awards 2024 : ఫిల్మ్​ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ కి పలువురు సినీ ప్రముఖులు హాజరై, అవార్డులు అందుకున్నారు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలతో పాటు సిరీస్లకు సంబంధించిన అవార్డులను ఫిల్మ్​ఫేర్ ఓటీటీ అవార్డుల వేదికపై ప్రకటించారు. అందులో భాగంగా సినిమా విభాగంలో ఉత్తమ నటి కేటగిరీలో కరీనా కపూర్ అవార్డును అందుకోగా, ఉత్తమ నటుడిగా దిల్జీత్ దోసాంజ్ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఇదే వేడుకలో టాలీవుడ్ నుంచి 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్ సత్తా చాటింది. 


ఫిల్మ్​ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకలో సాయి దుర్గ తేజ్, స్వాతి రెడ్డి కలిసి నటించిన షార్ట్ ఫిలిం 'సత్య' ఫిల్మ్​ఫేర్ ఓటీటీ అవార్స్- 2024లో టాలీవుడ్ నుంచి అవార్డును దక్కించుకున్న ఏకైక మూవీగా నిలిచింది. పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిలిం అనే క్యాటగిరిలో 'సత్య' మూవీ అవార్డును సొంతం చేసుకుంది. సాయి దుర్గ తేజ్, స్వాతితో పాటు 'సత్య' టీం ఆదివారం రాత్రి ఫిలింఫేర్ ఓటిటి అవార్డుల వేడుకలో పాల్గొని, అవార్డును అందుకున్నారు. అనంతరం టీమ్ అంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. 'సత్య' మూవీకి హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించగా.. విజయ్ కృష్ణ వికే దర్శకత్వ వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా రిలీజ్ అయిన 'సత్య' ప్రేక్షకుల మదిలో మంచి ఫీల్ గుడ్ షార్ట్ ఫిలింగా నిలిచింది. 


సిరీస్ కేటగిరీలో ఫిలింఫేర్ ఓటిటి అవార్డ్స్ - 2024 విన్నర్స్ 



  • ఉత్తమ సిరీస్ : ది రైల్వే మెన్

  • ఉత్తమ దర్శకుల సిరీస్ : సమీర్ సక్సేనా మరియు అమిత్ గోలానీ (కాలా పానీ)

  • ఉత్తమ నటుడు, సిరీస్ (మేల్) - కామెడీ : రాజ్‌కుమార్ రావు (గన్స్ అండ్ గులాబ్స్)

  • ఉత్తమ నటుడు, సిరీస్ (మేల్) - డ్రామా: గగన్ దేవ్ రియర్ (స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ)

  • ఉత్తమ నటి, సిరీస్ (మహిళ) : కామెడీ: గీతాంజలి కులకర్ణి (గుల్లక్ సీజన్ 4)

  • ఉత్తమ నటి, టెలివిజన్ (ఫిమేల్): డ్రామా: మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమండ్ బజార్)

  • ఉత్తమ సహాయ నటుడు, సిరీస్ (మేల్): కామెడీ: ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)

  • ఉత్తమ సహాయ నటుడు, సిరీస్ (మేల్): డ్రామా : ఆర్ మాధవన్ (ది రైల్వే మెన్)

  • ఉత్తమ సహాయ నటి, ధారావాహిక (ఫిమేల్): కామెడీ: నిధి బిష్త్ (మామ్లా లీగల్ హై)

  • ఉత్తమ సహాయ నటి, సిరీస్ (ఫిమేల్): డ్రామా: మోనా సింగ్ (మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2)

  • ఉత్తమ ఒరిజినల్ స్టోరీ, సిరీస్: బిశ్వపతి సర్కార్ (కాలా పానీ)

  • ఉత్తమ కామెడీ సిరీస్ : మామ్లా లీగల్ హై

  • ఉత్తమ (నాన్ ఫిక్షన్) ఒరిజినల్ (సిరీస్/స్పెషల్) : ది హంట్ ఫర్ వీరప్పన్

  • ఉత్తమ డైలాగ్, సిరీస్: సుమిత్ అరోరా (గన్స్ అండ్ గులాబ్స్)

  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సిరీస్ : AJ నిడిమోరు, కృష్ణ DK, సుమన్ కుమార్ (గన్స్ & గులాబ్స్)

  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, సిరీస్ : కిరణ్ యాద్న్యోపవిత్, కేదార్ పాటంకర్ మరియు కరణ్ వ్యాస్ (స్కామ్ 2003 - ది తెల్గి స్టోరీ)

  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్, సిరీస్ : సుదీప్ ఛటర్జీ (ISC), మహేష్ లిమాయే (ISC), హుయెన్‌స్టాంగ్ మోహపాత్రా, రగుల్ హెరియన్ ధరుమాన్ (హీరమండి : ది డైమండ్ బజార్)

  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, సిరీస్ : సుబ్రతా చక్రవర్తి, అమిత్ రాయ్ (హీరమండి: ది డైమండ్ బజార్)

  • ఉత్తమ ఎడిటింగ్, సిరీస్: యషా జైదేవ్ రాంచందనీ (ది రైల్వే మెన్)

  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, సిరీస్ : రింపుల్, హర్‌ప్రీత్ నరులా మరియు చంద్రకాంత్ సోనావానే (హీరమండి: ది డైమండ్ బజార్)

  • ఉత్తమ నేపథ్య సంగీతం, సిరీస్ : సామ్ స్లేటర్ (ది రైల్వే మెన్)

  • ఉత్తమ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్, సిరీస్: సంజయ్ లీలా భన్సాలీ, రాజా హసన్, శర్మిష్ట ఛటర్జీ (హీరామండి: ది డైమండ్ బజార్)

  • ఉత్తమ VFX (సిరీస్): ఫిల్మ్‌గేట్ AB, హైవ్ స్టూడియోస్ (ది రైల్వే మెన్)

  • ఉత్తమ సౌండ్ డిజైన్ (సిరీస్): సంజయ్ మౌర్య, ఆల్విన్ రెగో (కాలా పానీ)

  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, సిరీస్: శివ్ రావైల్ (ది రైల్వే మెన్)



సినిమాల లిస్ట్ కేటగిరీలో ఫిలింఫేర్ ఓటిటి అవార్డ్స్ - 2024 విన్నర్స్ 



  • ఉత్తమ చిత్రం, వెబ్ ఒరిజినల్: అమర్ సింగ్ చమ్కిలా

  • ఉత్తమ దర్శకుడు, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్: ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చమ్కిలా)

  • ఉత్తమ నటుడు, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (మేల్): దిల్జిత్ దోసాంజ్ (అమర్ సింగ్ చమ్కిలా)

  • ఉత్తమ నటి, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (లేడి): కరీనా కపూర్ ఖాన్ (జానే జాన్)

  • ఉత్తమ సహాయ నటుడు, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (మేల్): జైదీప్ అహ్లావత్ (మహారాజ్)


 


Also Read : సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట