Fighter: Siddharth Anand’s comments on audience spark controversy : బాలీవుడ్  హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకునే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫైటర్'. బాలీవుడ్ యాక్షన్ సినిమాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకున్నది. మొదటి మూడు రోజులు సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే 'ఫైటర్' రిజల్ట్ గురించి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తాజా ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆడియన్స్ కి తెలివి లేదని, అందుకే సినిమా సక్సెస్ కాలేకపోయిందనే విధంగా మాట్లాడారు.


'ఫైటర్' రిజల్ట్ పై సిద్ధార్థ్ ఆనంద్ రియాక్షన్ ఇదే


తాజా ఇంటర్వ్యూలో సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. "మన దేశంలో ఎంతమంది విమాన విజ్ఞానం గురించి చదువుకొని ఉంటారు? ఎంతమందికి పాస్‌పోర్ట్ ఉంది? ఎంతమంది విమానంలో ప్రయాణించి ఉంటారు? మహా అయితే వందలో పది శాతం మందే విమానం ప్రయాణం చేసి ఉంటారు. మిగిలిన 90 శాతం ప్రజలకి దాని గురించి కూడా తెలియదు. అలాంటి వారు ఫైటర్ మూవీ చూస్తే.. అది ఎలియాన్ సినిమాలా అనిపిస్తుంది’’ అంటూ ఆడియన్స్ ని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. దీంతో సిద్ధార్థ్ ఆనంద్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట కాంట్రవర్సీ అవుతున్నాయి.






సిద్ధార్థ్ ఆనంద్ వ్యాఖ్యలపై నెటిజన్ల మండిపాటు


'ఫైటర్' మూవీ రిజల్ట్ విషయంలో సిద్ధార్థ్ ఆనంద్ తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యల పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మీకు సినిమా తియ్యడం చేతకాక ఆడియన్స్ ని తప్పుపడుతున్నారా?, ముందు మీరు ఆడియన్స్ కి అర్ధమయ్యే రీతిలో సినిమా తియ్యండి. మీరు తప్పు చేసి ఆ నిందను ఆడియన్స్ మీద వేయడం కరెక్ట్ కాదు?.. అంటూ సిద్దార్థ్ ఆనంద్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


'ఫైటర్' ఓటీటీలోకి వచ్చేది అప్పుడే


'ఫైటర్' మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఫైటర్ ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. థియేటర్లో విడుదలైన 56 రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ ని మాట్లాడుకున్నప్పుడే థియేట్రికల్ రిలీజ్ తర్వాత 56 రోజులకు ఓటీటీలో రిలీజ్ చేసేలా అగ్రిమెంట్ జరిగిందట. దాని ప్రకారం ఫైటర్ మూవీ మార్చ్ మూడు లేదా నాలుగో వారంలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


'ఫైటర్' కాస్ట్ అండ్ క్రూ


ఏరియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనెలతో పాటూ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకి విశాల్ శేఖర్ సంగీతం అందించారు.


Also Read : ఆ సీన్ చెయ్యనని ముఖం మీదే చెప్పేసింది - నిత్యా మీనన్‌పై డైరెక్టర్ నందినీ రెడ్డి కామెంట్స్