Poonam Kaur About Her Health Issue: నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన కాంట్రవర్సియల్ కామెంట్స్‌తో తరచూ సోషల్ మీడియా, వార్తల్లో నిలుస్తుంది ఈ బ్యూటీ. ఏ విషయంపై అయినా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రచ్చ చేస్తుంది. అలాంటి ఆమె కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. దానికి కారణం ఆమె అనారోగ్యం. రెండేళ్లగా పూనమ్ ఫైబ్రోమైయాల్జీయా అనే వింత వ్యాధితో బాధపడుతుంది.
2022లో తీవ్రమైన వెన్ను నొప్పి రావడంతో ఆమె ఆయుర్వేద చికిత్సను ఆశ్రయించింది. ఇందు కోసం కేరళ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగా ఆమె ఫైబ్రోమైయాల్జీయా అనే వింత వ్యాధి బారిన పడ్డట్టు తేలింది. ఇదే విషయాన్ని గతంలోనే వెల్లడించింది పూనమ్. ఆ వ్యాధికి చికిత్స తీసుకున్న ఆమె తాజాగా ఓ టీవీ షోలో ఫైబ్రోమైయాల్జీయా వల్ల తనకు ఎంతగా ఇబ్బంది పడింది, ఈ వ్యాధి లక్షణాల గురించి వివరించింది. ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణతో కలిసి ఓ టీవీ షోకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఫైబ్రోమైయాల్జీయా గురించి చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా తన ఎక్స్‌లో షేర్ చేసింది.
దీనికి "మైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు అమూల్యం. మంచి మనసుగల వ్యక్తితో ఒక ఎపిసోడ్ లో పాలు పంచుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం" అంటూ షేర్ చేసింది. ఇందులో పూనమ్ "రెండేళ్లు ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఈ వ్యాధి వల్ల కనీసం దుస్తులు కూడా వేసుకోలేని స్థితికి వెళ్లాను. దానికి చికిత్స తీసుకున్న తర్వాత కూడా తీవ్రమైన నొప్పులు. బట్టలు వేసుకుంటున్నప్పుడు కూడా తీవ్రమైన నొప్పి. బాడీలో మూమెంట్స్ కూడా ఉండేవి కాదు. లూజ్ బట్టలు వేసుకోవాలి. అలా రెండేళ్లు ఈ వ్యాధి వల్ల నరకం చూశాను" అంటూ చెప్పుకొచ్చింది. అయితే పూర్తి వీడియో త్వరలోనే బయటకు రానుంది.
ఫైబరోమైయాల్జియా లక్షణాలు:
ఈ వ్యాధి బారిన వ్యక్తులు నిద్రలేమితో బాధపడుతుంటారు. శరీరంలో ఇమ్యునిటీ లోపం వస్తుంది. దానివల్ల అలసిపోవడం, శరీరం మొత్తం విపరీతమైన నొప్పి కలిగి ఉంటుంది. ముఖ్యంగా మెడ, భుజాలు, ఛాతీ, వీపు వద్ద నొప్పి ఉంటుంది. అందువల్ల కనీసం కదలడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. వారి శరీరమే వారికి బరువైపోతుందట. అంతేకాదు జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. దానితో పాటు ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఫైబ్రోమైయాల్జియాకు పూర్తి స్థాయిలో చికిత్స లేదని, దానికి సరిపోయే మందులు కూడా లేవని వైద్యులు అంటున్నారు. కానీ జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, యోగా, మెడిటేషన్ వంటి పద్దతుల వల్ల వ్యాధిని కంట్రోల్ చేయవచ్చని నిఫుణులు సూచిస్తున్నారు.
Also Read: పూనమ్ పాండే నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే