Esha Rebba : 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. ఆ తర్వాత ఆమె మొదటిసారిగా 'అంతక ముందు ఆ తర్వాత' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అంతే కాదు దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అయితే అందం, అభినయం విషయంలో మంచి మార్కులే పడ్డా.. ఈషా రెబ్బాకు మాత్రం అంతంత మాత్రంగానే ఆఫర్లు వస్తున్నాయి. ఆశించిన స్థాయిలో ఆమె కెరీర్ ముందుకు వెళ్లడం లేదు. కాగా రీసెంట్ గా ఆమె చేసిన కామెంట్సు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తనకు ఇద్దరు పిల్లలున్నారని చెప్పి అందర్నీ షాక్ కు గురి చేసింది.
ఏంటీ ఈషా రెబ్బాకు పెళ్లయిందా..? పిల్లలు కూడా ఉన్నారా..? ఎప్పుడు, ఎవరితో..? ఇలా చాలా డౌట్సే వస్తున్నాయి కదా. దాని గురించే ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మధ్యే ఓ షోలో పాల్గొన్న ఈషా రెబ్బాను అక్కడున్న యాంకర్.. ఆమెను తన లవ్ స్టోరీ చెప్పమని అడిగారు. ఈ ప్రశ్నకు బదులుగా ఆమె తనకు ఇద్దరు పిల్లలున్నారని చెప్పింది. ఈ మాటలతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఈ వీడియో అంతటితో ముగియడంతో సస్పెన్స్ అలాగే ఉండిపోయింది. అయితే ఆమె మరి చెప్పిందే నిజమైతే.. ఆ పిల్లలకు తండ్రి ఎవరు అని అంతా అనుకుంటున్నారు. లేదంటే ఆమె ఎవరినైనా దత్తత తీసుకుందా అని కూడా ఆలోచిస్తున్నారు. అదీ కాదంటే ఇంకెవరి పిల్లల్నైనా తన పిల్లలుగా పెంచుకుంటుందా అని చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పెంపుడు జంతువులను కూడా తమ పిల్లల్లానే చూసుకుంటున్నారు. ఒకవేళ ఈషా ఈ యాంగిల్ లో ఆలోచించి.. తన పెంపుడు జంతువుల గురించి చెప్పిందా అని పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటని ఈషాను మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ పిల్లలకు తండ్రి ఎవరా అని పలువురి పేర్లను లిస్ట్ లో చేరుస్తున్నారు. కాగా ఈషా రెబ్బా గతేడాది కోలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని, అతన్ని పెళ్లి చేసుకోబుతుందంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికవి పుకార్లుగానే మిగిలిపోయాయి. మరలా అయితే ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అని ఇంకొందరు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన 'మాయా బజార్ ఫర్ సేల్' వెబ్ సిరీస్ జూలై 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే సుధీర్ బాబు 'మామా మశ్చీంద్రా'తో పాటు తమిళంలో 'ఆయిరామ్ జన్మంగళ్' అనే మూవీ చేస్తూ ఈషా రెబ్బా ఫుల్ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు 'దయా' అనే మరో సిరీస్‌లో కూడా నటించింది.
Read Also : మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ, ఇంతకీ ఆ హీరో ఎవరంటే..!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial