Dulquer Salmaan New Telugu Movie: దుల్కర్ సల్మాన్ మలయాళీ. అయితే, అతడిని టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. తమవాడిగా ఫీల్ అవుతూ ఆయన ఫిలిమ్స్ అన్నీ చూస్తున్నారు. 'మహానటి'కి ముందు ఆయన ఫిలిమ్స్ డబ్బింగ్ అయితే చూసేవారు. 'మహానటి' తర్వాత ఆయనే తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. తెలుగులో దుల్కర్ సల్మాన్ కొత్తగా ఓకే చేసిన మూవీలో రవితేజ హీరోయిన్ సెలెక్ట్ అయ్యిందని తెలిసింది. కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే... 


దుల్కర్ సల్మాన్ జోడీగా భాగ్యశ్రీ బోర్సే! 
Bhagyashri Borse signs one more Telugu movie: భాగ్యశ్రీ బోర్సే... తెలుగుకు కొత్త హీరోయిన్. తెలుగులో ఆవిడ యాక్ట్ చేసిన సినిమా ఇంకా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. హిందీలో 'యారియాన్ 2' ఫిల్మ్ చేసింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్ట్ చేస్తున్న 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతోంది. ఇప్పుడు ఈ అమ్మాయి మరో ఆఫర్ అందుకుందని, అది కూడా దుల్కర్ సల్మాన్ జోడీగా అని టాలీవుడ్ టాక్.


'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'సార్' సినిమాలతో వెంకీ అట్లూరి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ఫిల్మ్ చేస్తున్నారు. అది సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా ఓకే చేశారు. 


శర్వానంద్ 'పడి పడి లేచే మనసు', నాని 'దసరా' సినిమాలు ప్రొడ్యూస్ చేసిన చెరుకూరి మూవీస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో దుల్కర్ సల్మాన్ ఒక మూవీ చెయ్యనున్నారు. పరశురామ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన రవి దర్శకుడిగా ఇంట్రడ్యూస్ కానున్నారు. ఆ మూవీలో భాగ్యశ్రీ బోర్సేకి హీరోయిన్ ఛాన్స్ దక్కిందని తెలిసింది.


Also Read: దీపికా పదుకునే... ఆ తెలుగు ఏంటి? తెలుగు పట్టిస్తావా? 'కల్కి'లో డబ్బింగ్ మార్చండ్రా బాబు - ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న టాలీవుడ్ ఆడియన్స్






దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించనున్నది లవ్ స్టోరీ అని టాలీవుడ్ టాక్. అందులో హార్ట్ టచింగ్ మూమెంట్స్ చాలా వుంటాయట. ఇండియాలో కొంత, అమెరికాలో కొంత షూటింగ్ చేస్తారని, ఈ ఏడాది సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలిసింది. 


విజయ్ దేవరకొండ సినిమాలో కూడా భాగ్యశ్రీ
Bhagyashri Borse upcoming telugu movies: రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ రిలీజ్ కంటే ముందు తెలుగులో భాగ్యశ్రీ మరో రెండు ఆఫర్లు అందుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ చేస్తున్న స్పై థ్రిల్లర్ సినిమాలో ఆమె హీరోయిన్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సినిమా. ఇప్పుడు ఆవిడ చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. అవి హిట్ అవ్వడంతో పాటు గ్లామర్, యాక్టింగ్ పరంగా పేరు తెచ్చుకుంటే స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా వుంటాయి.


Also Readకమల్ తప్ప ఇంకొకరు చేయగలరా? 'కల్కి'లో ఆయన్ను ఎంత మంది గుర్తు పట్టారు?