Pradeep Ranganathan's Dude Two Days Worldwide Collections: తమిళ స్టార్ ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. చిన్న సినిమాగా వచ్చినా మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లోనే మంచి వసూళ్లు సాధించింది.
రూ.50 కోట్లకు చేరువలో
దీపావళి స్పెషల్‌గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'డ్యూడ్' రెండు రోజుల్లోనే రూ.50 కోట్లకు చేరువలో కలెక్షన్స్ రాబడుతోంది. వరల్డ్ వైడ్‌గా 2 రోజుల్లో రూ.45 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీం వెల్లడించింది. 'డ్యూడ్ దివాళీ బ్లాక్ బస్టర్' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.22 కోట్లు వసూలు చేయగా... రెండో రోజు రూ.23 కోట్లు వసూళ్లు సాధించింది.
ఇండియావ్యాప్తంగా ఫస్ట్ డే రూ.10 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాగా... తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో అటు వరల్డ్ వైడ్‌గా ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మూడో రోజుకే రూ.50 కోట్లకు రీచ్ కావడం ఖాయమంటూ అంచనా వేస్తున్నారు. 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీస్‌తో పాటు 'డ్యూడ్'తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు ప్రదీప్. ఈ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Also Read: సడన్‌గా ఓటీటీలోకి 'దృశ్యం' డైరెక్టర్ మిస్టరీ థ్రిల్లర్ - ఈ ప్లాట్ ఫామ్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా... ప్రదీప్ సరసన 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో శరత్ కుమార్, రోహిణి, ద్రవిడ్ సెల్వం, హృదు హరూన్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. బావ, మరదలి అల్లరి, లవ్ స్టోరీతో పాటు కామెడీ డైలాగ్స్ అన్నింటినీ కలిపిన రొమాంటిక్ ఎంటర్టైనర్ అందరినీ ఆకట్టుకుంటోంది.