K RAMP Producer About His Movie Ratings: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కె ర్యాంప్' శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీం నిర్వహించిన థాంక్స్ మీట్‌లో ప్రొడ్యూసర్ రాజేష్ దండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా బాగున్నా కొంతమంది కావాలనే తక్కువ రేటింగ్స్ ఇస్తున్నారని... పార్షియాలిటీ ఎందుకని ప్రశ్నించారు. 

Continues below advertisement

రేటింగ్స్ చూసి బాధపడ్డా

'కె ర్యాంప్' మూవీ రేటింగ్స్ చూసి బాధ పడ్డానని ప్రొడ్యూసర్ రాజేష్ దండ తెలిపారు. 'సినిమా బాగున్న కొందరు కావాలనే తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. అందరికీ వినోదం పంచడం కోసం తీసిన సినిమానే 'కె ర్యాంప్'. ఈ కథలో లాజిక్స్ వెతకడం సరికాదు. నేను అందరి వ్యక్తిగత అభిప్రాయాలు గౌరవిస్తాను. నా చిత్రానికి ఎంత రేటింగ్ ఇచ్చినా ఓకేకానీ పక్షపాతం చూపించడం సరికాదు. అందుకే నేను బాధపడుతున్నా. సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చే కొందరు కొన్ని సినిమాలకు త్వరగా రివ్యూ ఇస్తున్నారు.

Continues below advertisement

కొన్ని చిత్రాలకు ముందు పస్టాఫ్ రివ్యూ ఇచ్చి... 3 గంటల తర్వాత సెకండాఫ్ రివ్యూ ఇస్తున్నారు. ఇంకొన్ని చిత్రాలకు రివ్యూ త్వరగా ఇచ్చినా... ఫైనల్ రేటింగ్ ఎప్పటికో కానీ డిసైడ్ చెయ్యడం లేదు. ఇంత పార్షియాలిటీ ఎందుకు?. ఓ చిన్న నిర్మాత ఏం చేసినా భరిస్తాడని అనుకుంటున్నారా?. ఇది నాలాంటి ఎంతోమంది నిర్మాతల సమస్య. బిగ్ ప్రాజెక్ట్ 'బాహుబలి' అయినా 'కె ర్యాంప్' అయినా ఒకేలా చూడాలి.' అని చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు తమ 'కె ర్యాంప్' సినిమా నచ్చిందని... థియేటర్లలో ఆడియన్స్ ఎంజాయ్ చేయడం చూశామని అన్నారు. ప్రేక్షకులే తమ సినిమాను ముందుకు తీసుకెళ్తారని అన్నారు.

Also Read: 'బాహుబలి: ది ఎపిక్' @ 500 కోట్ల కలెక్షన్స్ - ఏడేళ్ల క్రితమే బిజినెస్ మ్యాన్ ట్వీట్... రాజమౌళి విజన్‌ను మించి...

'మేము ముందుగానే చెప్పాం'

'కె ర్యాంప్' ప్రయోగాత్మక చిత్రమని తాము ఎక్కడా చెప్పలేదని... రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని ముందుగానే చెప్పామని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. 'ఒకవేళ సినిమా నిజంగా బాగా లేకపోతే నేను సక్సెస్ మీట్ పెట్టను. ఇంతకు ముందు నేను యాక్ట్ చేసిన ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాకి మార్నింగ్ షో తక్కువ రేటింగ్స్ ఇచ్చినా ఈవెనింగ్ షోలు ఫుల్ అయ్యాయి. మేము 'కె ర్యాంప్' ఎలాంటి చిత్రమో చెప్పిన తర్వాత కూడా కొందరు అలాంటి రేటింగ్స్ ఇచ్చారు. మేము చెప్పిన దాన్ని దృష్టిలో ఉంచుకుని పాజిటివ్‌గా చెబుతారని ఆశించాం. అలా చెప్పి ఉంటే మరింతగా ఆనందించే వాళ్లం.' అని అన్నారు.

ఫస్ట్ డే రెస్పాన్స్ చూసి తమకు చాలా ఆనందంగా ఉందని మూవీ టీం వెల్లడించింది. సోషల్ మీడియాలో వచ్చే రివ్యూలకు తాము తీసిన కంటెంట్‌కు ఎక్కడా పొంతన లేదని తన ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పినట్లు డైరెక్టర్ జైన్స్ నాని అన్నారు. థియేటర్లలో మూవీని అందరూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు.