బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ వచ్చి అప్పుడే వారం పూర్తయ్యింది. ఇక ఒక్కొక్కరికి ఇచ్చిపడేయడానికి నాగార్జున వచ్చేశారు. ఈ వారం తీర్పును ఆడియన్స్ చేతుల్లోనే పెట్టారు నాగ్. ముందుగా శుక్రవారం దివ్య - అయేషా మధ్య జరిగిన చపాతీ గొడవను చూపించారు. ఆ తరువాత హౌస్ లో వైల్డ్ కార్డ్స్ కు మాత్రమే ఐదుగురికి క్రౌన్ ఇవ్వమని కెప్టెన్ గౌరవ్ ను ఆదేశించారు. ముందుగా దువ్వాడ మధురితో మొదలు పెట్టారు. ఆమెకు ఇచ్చిన 'గోల్డెన్ బజర్' పవర్ డిజర్వ్డా లేదా అన్ డిజర్వ్డా అనేది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ ను చెప్పమన్నారు. అందులో సంజన మధురికి సపోర్ట్ చేసింది. కానీ దివ్య ఆమెకున్న ఫేవరిజం వల్ల డిజర్వ్డ్ కాదని చెప్పింది. 80% ఆడియన్స్ అదే నిజమని ఓటేశారు. దీంతో ఆడియన్స్ ఎందుకలా అనుకుంటున్నారో ఆమెనే అడగ్గా... "నాకు తెలుసు నేనేం చిన్న పిల్లలను కాదు" అంటూ సమాధానం చెప్పింది మాధురి. దీంతో "సమస్యల గురించి మాట్లాడుకుందాం" అంటూ కళ్యాణ్ - దువ్వాడ మాధురి గొడవ వీడియోను చూపించారు. "మాట్లాడిన విషయంలో తప్పు లేదు. మాట్లాడిన తీరులో తప్పు. ఇలా జరక్కుండా చూసుకోండి. అప్పుడే అందలం ఎక్కొచ్చు. లైట్స్ ఆర్పిన తరువాత గుసగుసలు వద్దు అనేది కరెక్ట్. కానీ చెప్పే విధానం. మాట తీరే అందలం ఎక్కిస్తుంది" అని నచ్చజెప్పారు నాగ్.
రమ్యకి క్లాస్ పీకిన నాగ్ నిఖిల్ కు కంటెండర్ అయ్యే పవర్ ను తీసేసే బాధ్యతను ఓజీలకు ఇచ్చారు. "మొదటి టాస్క్ ఫెయిల్ అయ్యాడు, బాల్ టాస్క్ లో అందరికీ ఇవ్వకుండా ఆడాల్సింది. ఈ పవర్ లేకుండా గేమ్స్ ఆడి కంటెండర్షిప్ గెలుచుకుని, కెప్టెన్ అవ్వాలి" అని చెప్పాడు కళ్యాణ్. 68% ఆడియన్స్ థంబ్స్ అప్ ఇచ్చారు. ఇమ్మన్యుయేల్ అదే చెప్పగా 87% అగ్రీ చేశారు.
రమ్య మోక్షకిచ్చిన పవర్ డిజర్వింగా కాదా? అనేది చెప్పడానికి రామూ వచ్చాడు. "ఆమె సుమన్ అన్ననే సెలెక్ట్ చేసుకుని అక్కడే గెలిచింది. ఆట బాగా ఆడుతుంది" అని చెప్పాడు. అతని అభిప్రాయానికి 81% థంబ్స్ అప్ ఇచ్చారు. రమ్యతో పాటు కళ్యాణ్ ను కన్ఫెషన్ రూంలోకి పిలిచి "క్రౌన్ పెట్టుకుంటే రాణి కారు" అంటూ ఆమె కళ్యాణ్ కు అమ్మాయిల పిచ్చి అన్న వీడియోను వేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా కళ్యాణ్ కే ఆ విషయాన్ని చెప్పించారు నాగ్. "చాలాసార్లు తనూజా ఇబ్బంది పడింది. అది నాకు నచ్చలేదు" అని చెప్పింది రమ్య. "ఓ మనిషిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వు ఆమెను జీవితాంతం చూడలేదు" అని నాగ్ అనడంతో రమ్య సారీ చెప్పింది. ఆడియన్స్ 53% ఓటింగ్ తో కళ్యాణ్ ది తప్పు అని నిర్ణయించారు. అలాగే కళ్యాణ్ ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు నాగ్. అలాగే ఏకంగా డెమోన్ ను తన తమ్ముడు అని చెప్పి షాక్ ఇచ్చింది రమ్య.
డెమోన్ - రీతూల మధ్య ట్రస్ట్ ఇష్యూస్ నెక్స్ట్ డెమోన్ - రీతూలను పిలిచి, రమ్య వాళ్ళ బంధం గురించి మాట్లాడిన వీడియోను చూపించారు. "అసలేం జరిగింది అనేది తెలుసుకోవడానికి రమ్యను అలా అడిగాను. రీతూ నాతో జెన్యూన్ గానే ఉంది" అని చెప్పాడు డెమోన్. "పవన్ కి నామీద నమ్మకం లేదని అర్థమైంది" అని రీతూ కుండబద్దలు కొట్టింది. దీంతో డెమోన్ "ఈ హౌస్ లో రీతూ మీదున్న ఫీలింగ్ ఇంకెవ్వరి మీద లేదు" అన్నాడు డెమోన్. కానీ దానికి ఆడియన్స్ 100 % థంబ్ డౌన్ ఇచ్చారు.
Also Read: భరణి ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే... 6 వారాల్లో నాన్న జేబులో పడింది ఎంతంటే?
శ్రీనివాస్ సాయికి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ, అయేషాకు నామినేషన్ పవర్ డిసర్వ్డ్ అని చెప్పారు. మిగతా వాళ్ళ పవర్ ను తీసేశారు. తనూజా కన్ఫెషన్ రూంలోకి పిలిచి, మాధురి - రమ్య - గౌరవ్ - నిఖిల్ కలిసి మాట్లాడుకున్న వీడియోను చూపించారు. "అమ్మాయిల్ని గెలుకుతాడు. తనూజా చెయ్యేస్తే నచ్చకపోతే చెప్పేయాలి. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు" అని రమ్య, మాధురి చేసిన కామెంట్స్ ను "ఇమేజ్ పొల్యూట్ చేస్తున్నారు" అంటూ నాగ్ చూపించారు. తమ మధ్య అలాంటిదేం లేదని తనూజ ఇచ్చిన క్లారిటీ కరెక్ట్ అంటూ ఆడియన్స్ పోలింగ్ లో 88% తమ్స్ అప్ ఇచ్చారు. చివరగా ఇమ్మన్యుయేల్ కి "పగిలిపోతుంది. కళ్ళు నెత్తికెక్కాయి. పొగరు పెరిగింది. వైబ్ క్రియేట్ చేస్తున్నాడు" అని 90% కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే పొట్ట పగిగేలా పార్టీ అని బంపర్ ఆఫర్ ఇచ్చారు నాగ్. ఆడియన్స్ 100% ఓటింగ్ ఇచ్చారు. మాధురిని కొత్త రేషన్ మ్యానేజర్ చేశారు.