సౌత్ కొరియన్, హాలీవుడ్ సినిమాలు చూసే టాలీవుడ్ - ఇండియన్ ప్రేక్షకులకు డాన్ లీ (Don Lee) తెలిసే ఉంటారు. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వల్ల ఈ నటుడు తెలుగు ప్రేక్షకులలో పాపులర్ అవుతున్నారు. మార్చి 9న డాన్ లీ పుట్టిన రోజు. తనకు వచ్చిన గిఫ్టులు, కేకులతో ఆయన ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ఈ రోజు షేర్ చేశారు. వెంటనే కామెంట్ సెక్షన్ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పిన విషెస్, చేసిన కామెంట్లతో నిండిపోయింది.
మేం ఇచ్చే ఎలివేషన్స్ ఏంటి?నువ్వు చేసే పోస్టులేంటి? సింక్ ఉందా?'డాన్ లీ సాబ్... మేము ఇచ్చే ఎలివేషన్లకు, నువ్వు వేసే పోస్టులకు ఏమైనా సింక్ ఉందా?' అని ప్రభాస్ బాక్స్ ఆఫీస్ అని పేరు పెట్టుకున్న ఒక హ్యాండిల్ కామెంట్ చేసింది. 'అయ్య (డాన్ లీ) గారు... నమస్కారం! మేము డైనోసార్ తాలూకా' అని ఒకరు, 'అందరూ విషెస్ చెప్పినట్టేనా?' అని ఇంకొకరు, 'నీ కటౌట్ కి, నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా?' అని మరొకరు... డాన్ లీ ఇన్‌స్టాగ్రామ్ బర్త్ డే పోస్టు కింద తెలుగు కామెంట్లు బోలెడు ఉన్నాయి.
డాన్ లీని 'అన్న' అని ఒకరు, 'మామ' అని మరొకరు... సౌత్ కొరియన్ నటుడితో చుట్టరికాలు కలిపేస్తున్నారు. సొంతవాడిని పిలిచినట్టు పిలుస్తున్నారు. 'ఒరేయ్ ఈ రోజు ఆయన పుట్టిన రోజు రా.... వదిలేయండి రా' అని ఒకరు కామెంట్ చేశారు. ఈ కామెంట్లు చేసే వారిలో ప్రభాస్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు డాన్ లీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నారు? అంటే... కారణం 'స్పిరిట్' సినిమా!
ప్రభాస్ 'స్పిరిట్'లోనా? 'సలార్'లోనా!?'సలార్' సినిమా విడుదలైన తర్వాత ఆ పోస్టర్ షేర్ చేశారు డాన్ లీ. వై? ఎందుకు? అంటే... ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న 'స్పిరిట్' సినిమాలో ఆయన కూడా ఒక రోల్ చేయనున్నట్లు వినపడింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ 'సలార్ 2'లో యాక్ట్ చేస్తున్నారని వినపడింది. అయితే, ఆ రెండు సినిమా యూనిట్స్ ఈ న్యూస్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది ఇవ్వలేదు. కానీ ప్రభాస్‌తో డాన్ లీ ఓ సినిమా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు లీకుల బెడద... సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగతులు
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ 'లూసిఫర్ 2'లోనూ డాన్ లీ నటించినట్లు ప్రచారం జరగడంతో మలయాళీలు సైతం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Don Lee Hit Movies: డాన్ లీ నటించిన హారర్ యాక్షన్ ఫిలిమ్ 'ట్రైన్ టు బూసాన్', గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలు 'నేమ్ లెస్ గ్యాంగ్ స్టర్: రూల్స్ ఆఫ్ ది టైం', 'ది నైబర్', 'ది అవుట్ లాస్' భారీ విజయాలు సాధించడమే కాదు... సౌత్ కొరియన్ ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరిని మెప్పించాయి. ఆ సినిమాల ద్వారా కొంత మందికి ఆయన తెలుసు. ఇప్పుడు ప్రభాస్ పుణ్యమా అని డాన్ లీని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు.
Also Read: మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా